అఖిల్ కొత్త సినిమా అప్‌డేట్ | Sakshi
Sakshi News home page

Published Fri, Jan 5 2018 11:22 AM

Akhil Akkineni Next Movie Detailes - Sakshi

తొలి సినిమాతో ఘోరంగా విఫలమైన అక్కినేని యంగ్ హీరో అఖిల్, రెండో సినిమాతో ఆకట్టుకున్నాడు. హలో అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన అఖిల్ రెండో సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా యాక్షన్స్ సీన్స్, డ్యాన్స్ లలో అఖిల్ చూపిస్తున్న ఈజ్ అభిమానులను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం తన నెక్ట్స్ సినిమా మీద దృష్టి పెట్టిన ఈ యంగ్ హీరో ఈ నెల 10న కొత్త సినిమాను ప్రకటించనున్నాడు.

ఇటీవల రెండు కథలు వింటున్నట్టుగా వెల్లడించాడు అఖిల్. వీటిలో ప్రముఖ నటుడు ఆది పినిశెట్టి సోదరుడు సత్య పినిశెట్టి చెప్పిన కథ కూడా ఉందట. అఖిల్ కూడా ఈ యువ దర్శకుడితోనే కలిసి పనిచేసేందుకు ఆసక్తికనబరుస్తున్నాడన్న ప్రచారం జరుగుతోంది. అయితే హలో విషయంలో కూడా చాలా మంది దర్శకుల పేర్లు వినిపించిన తరువాత విక్రమ్ ను ఫైనల్ చేశారు. మరి మూడో సినిమా విషయంలో అఖిల్ ప్లాన్ ఎలా ఉంటుందో చూడాలి.

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement