ఐశ్వర్యరాయ్ కు ‘గ్లోబల్ ఇండియన్’ అవార్డు | - Aishwarya wins Global Indian of the Year award | Sakshi
Sakshi News home page

ఐశ్వర్యరాయ్ కు ‘గ్లోబల్ ఇండియన్’ అవార్డు

Apr 12 2016 6:00 PM | Updated on Sep 3 2017 9:47 PM

బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్ బచ్చన్‌ ‘గ్లోబల్ ఇండియన్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు లభించింది.

ముంబై: బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్ బచ్చన్‌ ‘గ్లోబల్ ఇండియన్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు లభించింది. సోమవారం రాత్రి జరిగిన   కార్యక్రమంలో ఐష్ ఈ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా ఐష్ మాట్లాడుతూ.. తాను ఇష్టంతో సినిమా రంగంలోకి వచ్చాననీ, ఇక్కడ  అనేక అవకాశాలు తనకు లభించాయని తెలిపారు.

సామాజికంగా అనేక కార్యక్రమాలు చేయడానికి సినిమా రంగం తనకు అవకాశం కల్పించిదని అన్నారు. ఈ అవార్డుతో అంతర్జాతీయ స్థాయిలో మహిళలకు ప్రతినిధిగా నిలబడతానని చెప్పారు. ఈ అవార్డును తన కూతురు ఆరాధ్యకు అంకితం చేస్తున్నట్టు తెలిపారు. ఐశ్వర్యతో పాటు 17 మంది వివిధ రంగాల్లోని ప్రముఖ మహిళలకు సైతం అవార్డులు లభించాయి.

 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement