ఐశ్వర్యరాయ్ కు ‘గ్లోబల్ ఇండియన్’ అవార్డు
ముంబై: బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్ బచ్చన్ ‘గ్లోబల్ ఇండియన్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు లభించింది. సోమవారం రాత్రి జరిగిన కార్యక్రమంలో ఐష్ ఈ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా ఐష్ మాట్లాడుతూ.. తాను ఇష్టంతో సినిమా రంగంలోకి వచ్చాననీ, ఇక్కడ అనేక అవకాశాలు తనకు లభించాయని తెలిపారు.
సామాజికంగా అనేక కార్యక్రమాలు చేయడానికి సినిమా రంగం తనకు అవకాశం కల్పించిదని అన్నారు. ఈ అవార్డుతో అంతర్జాతీయ స్థాయిలో మహిళలకు ప్రతినిధిగా నిలబడతానని చెప్పారు. ఈ అవార్డును తన కూతురు ఆరాధ్యకు అంకితం చేస్తున్నట్టు తెలిపారు. ఐశ్వర్యతో పాటు 17 మంది వివిధ రంగాల్లోని ప్రముఖ మహిళలకు సైతం అవార్డులు లభించాయి.