'జాజ్ బా' ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల | Aishwarya Rai Bachchan Jazbaa first look released | Sakshi
Sakshi News home page

'జాజ్ బా' ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

May 19 2015 5:12 PM | Updated on Sep 3 2017 2:19 AM

'జాజ్ బా' ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

'జాజ్ బా' ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

ఐశ్వర్యరాయ్ ఐదేళ్ల తర్వాత నటించిన 'జాజ్ బా' సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది.

ముంబై: ఐశ్వర్యరాయ్ ఐదేళ్ల తర్వాత నటించిన 'జాజ్ బా' సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. దర్శకుడు సంజయ్ గుప్తా దీన్ని ట్విటర్ లో పోస్ట్ చేశారు. సిటీ స్కేప్ బాక్ గ్రౌండ్ లో ఆవేదనతో ఉన్న ఐష్ దుమ్ములో కూర్చున్నట్టుగా పోస్టర్ లో ఉంది. ఈ సినిమా ప్రచార చిత్రాన్ని అధికారికంగా 68వ కేన్స్ చలన చిత్రోత్సవంలో విడుదల చేశారు. ఇందుకోసం ఐశ్వర్వరాయ్ కేన్స్ ఫిల్మ ఫెస్టివల్ కు హాజరయ్యారు. ఆమె కేన్స్ చలన చిత్రోత్సవంలో ఇది 14వసారి.

'జాజ్ బా' సినిమాలో ఐష్ లాయర్ గా నటించింది. 2010లో విడుదలైన 'గుజారిష్' తర్వాత ఐశ్వర్య మళ్లీ తెరపై కనిపించలేదు. ఐదేళ్ల తర్వాత ఆమె మళ్లీ కెమెరా ముందుకు రావడంతో 'జాజ్ బా' కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఇర్ఫాన్ ఖాన్, షబనా అజ్మీ, అనుమప్ ఖేర్ ఇతర పాత్రల్లో నటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement