breaking news
Jazbaa movie
-
అరబిక్ క్లాస్‌కు... ఐష్
అందాల తార ఐశ్వర్యారాయ్ ఇప్పుడు స్టూడెంట్‌గా మారిపోయారు. బుద్ధిగా పుస్తకాలు, పెన్నుతో కుస్తీ పడుతున్నారు. ఇదంతా ఎందుకూ అంటే... ఐష్ ఇప్పుడు అరబిక్ భాష నేర్చుకుంటున్నారు. దానికి సంబంధించిన తరగతులకు వెళుతున్నారామె. ప్రస్తుతం నటిస్తున్న ‘జజ్బా’ సినిమా కోసమే ఆమె ఈ భాష నేర్చుకుంటున్నారు. ఇది హిందీ సినిమా కదా, అరబిక్ ఎందుకు నేర్చుకుంటున్నారు అనుకోవచ్చు. ఈ చిత్రాన్ని అరబిక్ భాషలోకి అనువదించి, విడుదల చేయనున్నారు. హిందీలో డబ్బింగ్ చెప్పుకున్నట్టే అరబిక్ చిత్రానికి కూడా తానే చెప్పుకోవాలనుకున్నారు ఐష్. అందుకే నేర్చుకుంటున్నారు. అరబ్ దేశాల్లో బాలీవుడ్ సినిమాలకు మంచి మార్కెట్ ఉందట. అందుకే ఈ చిత్రాన్ని అరబిక్ భాషలో విడుదల చేయడానికి దర్శకుడు సంజయ్‌గుప్తా సన్నాహాలు చేస్తున్నారు. నాలుగేళ్ల విరామం తర్వాత ఐష్ నటించిన ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రం కోసం ఆమె ఓ పాట కూడా పాడారు. అదో హైలైట్ అయితే, తన కెరీర్లో ఐష్ తొలిసారి లాయర్‌గా నటించిన చిత్రం ఇదే కావడం మరో హైలైట్. న్యాయస్థానంలో ఐష్ చేయబోయే వాదనను చూడాలంటే అక్టోబర్ దాకా ఆగాల్సిందే. -
యాక్షన్రోల్లో కనిపించబోతున్న ఐష్
-
'జాజ్ బా' ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల
ముంబై: ఐశ్వర్యరాయ్ ఐదేళ్ల తర్వాత నటించిన 'జాజ్ బా' సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. దర్శకుడు సంజయ్ గుప్తా దీన్ని ట్విటర్ లో పోస్ట్ చేశారు. సిటీ స్కేప్ బాక్ గ్రౌండ్ లో ఆవేదనతో ఉన్న ఐష్ దుమ్ములో కూర్చున్నట్టుగా పోస్టర్ లో ఉంది. ఈ సినిమా ప్రచార చిత్రాన్ని అధికారికంగా 68వ కేన్స్ చలన చిత్రోత్సవంలో విడుదల చేశారు. ఇందుకోసం ఐశ్వర్వరాయ్ కేన్స్ ఫిల్మ ఫెస్టివల్ కు హాజరయ్యారు. ఆమె కేన్స్ చలన చిత్రోత్సవంలో ఇది 14వసారి. 'జాజ్ బా' సినిమాలో ఐష్ లాయర్ గా నటించింది. 2010లో విడుదలైన 'గుజారిష్' తర్వాత ఐశ్వర్య మళ్లీ తెరపై కనిపించలేదు. ఐదేళ్ల తర్వాత ఆమె మళ్లీ కెమెరా ముందుకు రావడంతో 'జాజ్ బా' కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఇర్ఫాన్ ఖాన్, షబనా అజ్మీ, అనుమప్ ఖేర్ ఇతర పాత్రల్లో నటించారు.