అరబిక్ క్లాస్‌కు... ఐష్ | Aishwarya Rai Bachchan to learn Arabic | Sakshi
Sakshi News home page

అరబిక్ క్లాస్‌కు... ఐష్

Sep 1 2015 12:17 AM | Updated on Sep 3 2017 8:29 AM

అరబిక్ క్లాస్‌కు... ఐష్

అరబిక్ క్లాస్‌కు... ఐష్

అందాల తార ఐశ్వర్యారాయ్ ఇప్పుడు స్టూడెంట్‌గా మారిపోయారు. బుద్ధిగా పుస్తకాలు, పెన్నుతో కుస్తీ పడుతున్నారు.

అందాల తార ఐశ్వర్యారాయ్  ఇప్పుడు స్టూడెంట్‌గా మారిపోయారు. బుద్ధిగా పుస్తకాలు, పెన్నుతో కుస్తీ పడుతున్నారు. ఇదంతా ఎందుకూ అంటే... ఐష్  ఇప్పుడు అరబిక్ భాష నేర్చుకుంటున్నారు. దానికి సంబంధించిన తరగతులకు వెళుతున్నారామె. ప్రస్తుతం నటిస్తున్న ‘జజ్బా’ సినిమా కోసమే ఆమె ఈ భాష నేర్చుకుంటున్నారు. ఇది హిందీ సినిమా కదా, అరబిక్ ఎందుకు నేర్చుకుంటున్నారు అనుకోవచ్చు. ఈ చిత్రాన్ని అరబిక్ భాషలోకి అనువదించి, విడుదల చేయనున్నారు.

హిందీలో డబ్బింగ్ చెప్పుకున్నట్టే అరబిక్ చిత్రానికి కూడా తానే చెప్పుకోవాలనుకున్నారు ఐష్. అందుకే నేర్చుకుంటున్నారు. అరబ్ దేశాల్లో బాలీవుడ్ సినిమాలకు మంచి మార్కెట్ ఉందట. అందుకే ఈ చిత్రాన్ని అరబిక్ భాషలో విడుదల చేయడానికి దర్శకుడు సంజయ్‌గుప్తా సన్నాహాలు చేస్తున్నారు. నాలుగేళ్ల విరామం తర్వాత ఐష్ నటించిన ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి.

ఈ చిత్రం కోసం ఆమె ఓ పాట కూడా పాడారు. అదో హైలైట్ అయితే, తన కెరీర్‌లో ఐష్ తొలిసారి లాయర్‌గా నటించిన చిత్రం ఇదే కావడం మరో హైలైట్. న్యాయస్థానంలో ఐష్ చేయబోయే వాదనను చూడాలంటే అక్టోబర్ దాకా ఆగాల్సిందే.

Advertisement
 
Advertisement
Advertisement