breaking news
Arabic language
-
అరబిక్‌లో మాట్లాడారని విమానం దించేశారు
న్యూయార్క్: పారిస్ ఘటనతో అమెరికాలో ముస్లింలను చూస్తేనే భయపడతున్నారు. చికాగో విమానాశ్రయంలో అరబిక్ భాషలో మాట్లాడిన ఇద్దరు పాలస్తీనా జాతీయులు విమానం ఎక్కకుండా విమానాశ్రయ అధికారులు అడ్డుకున్నారు. వీరిద్దరూ పదిహేనేళ్ల క్రితమే పాలస్తీనా నుంచి వచ్చి ఫిలడెల్ఫియాలో స్థిరపడ్డారు. వీరిలో మిఠాయిల వ్యాపారం చేస్తున్న ఓ వ్యక్తి వద్ద తెలుపురంగు బాక్సుందని ప్రయాణికులు తెలపటంతో విచారించిన పోలీసులు ఆ బాక్స్‌ను తెరిపించి ఏమీ లేదని తేలాక వీరిద్దరినీ వేరే విమానంలో పంపించారు. మరో ఘటనలో, చికాగో నుంచి హ్యూస్టన్ వెళుతున్న మరో విమానంలో ఉన్న ఆరుగురు ముస్లింలతో కలిసి ప్రయాణించేందుకు తోటి ప్రయాణికులు ఒప్పుకోలేదు. దీంతో ఈ ఆరుగురిని దించేసి వేరే విమానంలో పంపించారు. -
అరబిక్ క్లాస్‌కు... ఐష్
అందాల తార ఐశ్వర్యారాయ్ ఇప్పుడు స్టూడెంట్‌గా మారిపోయారు. బుద్ధిగా పుస్తకాలు, పెన్నుతో కుస్తీ పడుతున్నారు. ఇదంతా ఎందుకూ అంటే... ఐష్ ఇప్పుడు అరబిక్ భాష నేర్చుకుంటున్నారు. దానికి సంబంధించిన తరగతులకు వెళుతున్నారామె. ప్రస్తుతం నటిస్తున్న ‘జజ్బా’ సినిమా కోసమే ఆమె ఈ భాష నేర్చుకుంటున్నారు. ఇది హిందీ సినిమా కదా, అరబిక్ ఎందుకు నేర్చుకుంటున్నారు అనుకోవచ్చు. ఈ చిత్రాన్ని అరబిక్ భాషలోకి అనువదించి, విడుదల చేయనున్నారు. హిందీలో డబ్బింగ్ చెప్పుకున్నట్టే అరబిక్ చిత్రానికి కూడా తానే చెప్పుకోవాలనుకున్నారు ఐష్. అందుకే నేర్చుకుంటున్నారు. అరబ్ దేశాల్లో బాలీవుడ్ సినిమాలకు మంచి మార్కెట్ ఉందట. అందుకే ఈ చిత్రాన్ని అరబిక్ భాషలో విడుదల చేయడానికి దర్శకుడు సంజయ్‌గుప్తా సన్నాహాలు చేస్తున్నారు. నాలుగేళ్ల విరామం తర్వాత ఐష్ నటించిన ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రం కోసం ఆమె ఓ పాట కూడా పాడారు. అదో హైలైట్ అయితే, తన కెరీర్లో ఐష్ తొలిసారి లాయర్‌గా నటించిన చిత్రం ఇదే కావడం మరో హైలైట్. న్యాయస్థానంలో ఐష్ చేయబోయే వాదనను చూడాలంటే అక్టోబర్ దాకా ఆగాల్సిందే.