బాసూ.. బసు ఈజ్‌ బ్యాక్‌

Aishwarya Rai Bachchan dropped out from 'Woh Kaun Thi' remake - Sakshi

బిపాసా బసు స్క్రీన్‌ మీద కనిపించి సుమారు మూడేళ్లు అయిపోయింది. 2015లో కనిపించిన ‘ఎలోన్‌’ ఆమె లాస్ట్‌ రిలీజ్‌. ఇప్పుడు గ్యాప్‌కి బ్రేక్‌ ఇచ్చి సినిమాలు స్టార్ట్‌ చేస్తున్నారు. అయితే తన భర్త కరణ్‌ సింగ్‌ గ్రోవర్‌తో కలిసే మళ్లీ కంబ్యాక్‌ ఇస్తున్నారు. సింగర్‌ మైకా సింగ్‌ నిర్మించనున్న ఈ చిత్రంలో కరణ్, బిపాస హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాతోపాటు ‘వో కౌన్‌ తీ’ సినిమాలోనూ యాక్ట్‌ చేయడానికి రెడీ అయ్యారు. నిజానికి ‘వో కౌన్‌ తీ’లో ఫస్ట్‌ హీరోయిన్‌గా ఐశ్వర్యారాయ్‌ యాక్ట్‌ చేయాల్సింది. కానీ ఐష్‌ తప్పుకోవడంతో ఈ ప్రాజెక్ట్‌లోకి  బిపాస ఎంటర్‌ అయ్యారు. ఇదిలా ఉంటే.. 2016లో కరణ్‌ సింగ్‌ గ్రోవర్‌–బిపాసా ప్రేమ వివాహం చేసుకున్నారు. మ్యారీడ్‌ లైఫ్‌ కోసమే రెండేళ్లు బ్రేక్‌ తీసుకున్నారామె.
 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top