రీ ఎంట్రీలో దూకుడు | aishwarya doing a film with karanjohar | Sakshi
Sakshi News home page

రీ ఎంట్రీలో దూకుడు

Aug 30 2015 1:16 PM | Updated on Sep 3 2017 8:25 AM

చాలా రోజలుగా భారతీయ సినీ అభిమానులు ఎదురుచూస్తున్న రోజు దగ్గరకొచ్చింది. అందాల తార ఐశ్వర్యారాయ్ లీడ్ రోల్ లో నటించిన జెజ్బా రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇప్పటికే షూటింగ్...

చాలా రోజలుగా భారతీయ సినీ అభిమానులు ఎదురుచూస్తున్న రోజు దగ్గరకొచ్చింది. అందాల తార ఐశ్వర్యారాయ్ లీడ్ రోల్ లో నటించిన 'జెజ్బా' రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న  ఈ సినిమా ప్రస్థుతం ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. హీరోయిన్ ఐష్ తో పాటు ఇర్ఫాన్ ఖాన్ కూడా ప్రమోషనల్ ఈవెంట్లలో సందడి చేస్తున్నాడు. లాంగ్ గ్యాప్ తరువాత ఐష్ చేస్తున్న సినిమా కావటంతో ఈ సినిమాపై హై ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి.

అయితే రీ ఎంట్రీ సినిమా ఇంకా రిలీజ్ కూడా కాకముందే తన నెక్ట్స్ సినిమాను పట్టాలెక్కించే పనిలో పడింది ఐశ్వర్య. 'జెజ్బా' రిలీజ్ కు ఇంకా సమయం ఉండటంతో ఈ లోగా సినిమా స్టార్ట్ చేయాలని డిసైడ్ అయ్యింది. అమ్మ అయిన తరువాత కూడా చెక్కు చెదరని అందంతో ఆకట్టుకుంటున్న ఐష్, కరణ్ జోహార్ డైరెక్షన్ లో తెరకెక్కనున్న ఏ దిల్ హై ముష్కిల్ సినిమాలో నటించడానికి రెడీ అవుతుంది.

దాదాపు ఐదేళ్ల పాటు వెండితెరకు దూరంగా ఉన్న ఈ బ్యూటి  రీ ఎంట్రీలో వరుస సినిమాలతో అభిమానులను అలరించడానికి రెడీ అవుతుంది. అందుకే ఒక సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమాకు రెడీ అయిపోతోంది. అంతేకాదు ఈ వయసులో యంగ్ హీరోల సరసన జోడి కడుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. కరణ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న  ఏ దిల్ మై ముష్కిల్ సినిమాలో రణబీర్ తో కలిసి ఆడిపాడనుంది ఐష్.

Advertisement
 
Advertisement
Advertisement