ఐశ్వర్యా ధనుష్‌ సాధించారు | Aishwarya Dhanush achieved | Sakshi
Sakshi News home page

ఐశ్వర్యా ధనుష్‌ సాధించారు

Dec 14 2016 1:37 AM | Updated on Sep 4 2017 10:38 PM

ఐశ్వర్యా ధనుష్‌ సాధించారు

ఐశ్వర్యా ధనుష్‌ సాధించారు

మహిళా దర్శకురాలు, నటుడు ధనుష్‌ అర్ధాంగి ఐశ్వర్య తాను అనుకున్నది సా«ధించారు.

మహిళా దర్శకురాలు, నటుడు ధనుష్‌ అర్ధాంగి ఐశ్వర్య తాను అనుకున్నది సా«ధించారు. ఆమె ప్రయత్నం ఫలించింది. 3 చిత్రంతో దర్శకురాలిగా మెగాఫోన్ పట్టిన ఐశ్వర్యాధనుష్‌ తొలి చిత్రంతోనే ప్రాచుర్యం పొందారు. ఆ తరువాత వైరాజావై అంటూ మరో వైవిధ్యభరిత కథా చిత్రాన్ని తెరకెక్కించారు. తాజాగా స్టంట్‌ కళాకారుల నిజ జీవితాలతో ఒక లఘుచిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇటీవల కేంద్ర సమాచార, సినిమాటోగ్రఫి మంత్రి వెంకయ్యనాయుడిని కలిసి ఈ చిత్రం ప్రాధాన్యతను  వివరించారు.

పనిలో పనిగా జాతీయ అవార్డుల పట్టికలో నటీనటుల నంచి దర్శకుడు, నిర్మాత, సంగీతదర్శకుడు, ఛాయాగ్రహకుడు, గాయకులు, రచయితలు, గీతరచయితలు, ఎడిటర్‌ అంటూ అందరు చోటు చేసుకున్నారనీ, ఎన్నో కష్టనష్టాలను భరిస్తూ, ప్రాణాలను లెక్కచేయకుండా నటించే స్టంట్‌ మాస్టర్లకు జాతీయ అవార్డులు అందిచండం లేదన్న విషయాన్ని ఐశ్వర్యాధనుష్‌ కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు దృష్టికి తీసుకెళ్లడంతో పాటు వారిని జాతీయ అవార్డుల పట్టికలో చేర్చాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఐశ్వర్య కోరికను పరిగణలోకి తీసుకున్న కేంద్రమంత్రి రానున్న 64వ జాతీయ అవార్డుల ప్రధానోత్సవం కార్యక్రమంలో స్టంట్‌ మాస్టర్లకు అవార్డులను అందించాలన్న నిర్ణయం తీసుకున్నట్లు తాజా సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement