అదనంగా ఇస్తేనే.. | actress swetha demands for extra money | Sakshi
Sakshi News home page

అదనంగా ఇస్తేనే..

Dec 18 2013 1:56 AM | Updated on Apr 3 2019 9:17 PM

అదనంగా ఇస్తేనే.. - Sakshi

అదనంగా ఇస్తేనే..

నటీమణుల్లో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రయత్నించే వారు కొందరైతే, అవకాశం వచ్చినప్పుడే సాధ్యమైనంత వరకు డబ్బు గుంజుకోవాలనే హీరోయిన్లు మరికొందరుంటారన్నది వాస్తవం.

నటీమణుల్లో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రయత్నించే వారు కొందరైతే, అవకాశం వచ్చినప్పుడే సాధ్యమైనంత వరకు డబ్బు గుంజుకోవాలనే హీరోయిన్లు మరికొందరుంటారన్నది వాస్తవం. ఇక్కడ రెండో కోవకు చెందిన నటి శ్వేత అంటున్నారు. ఎండ్రుమ్ ఆనందం చిత్ర దర్శక నిర్మాతలు నార్కాలి పిక్చర్స్ పతాకంపై మహిళా నిర్మాత విమల రాజనాయకం నిర్మిస్తున్న చిత్రం ఎండ్రుమ్ ఆనందం. వివేక్ భారతి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బాల నటుడిగా పలు చిత్రాల్లో నటించిన మహేంద్రన్ హీరోగా నటిస్తున్నారు.

ఆయనకు జంటగా వర్తమాన తార శ్వేత నటిస్తున్నారు. ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం ఇటీవల జరిగింది. ఈ కార్యక్రమంలో హీరోయిన్ పాల్గొనకపోవడానికి కారణాన్ని దర్శక నిర్మాతలు తెలుపుతూ ఆమెకు నిర్ణయించిన పారితోషికం చెల్లించినా అదనంగా డబ్బు ఇస్తేనే ఆడియో ఆవిష్కరణకు వస్తానని చెప్పినట్లు పేర్కొన్నారు. ఈ విషయమై నిర్మాతల మండలికి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. చిత్ర ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనని హీరోయిన్లపై తమిళ నిర్మాతల మండలి చర్యలు తీసుకుంటున్నా శ్వేత లాంటి హీరోయిన్లు ఇంకా ఉండటం గమనార్హం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement