
ప్రముఖ సహాయ నటి సురేఖ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది.
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ సహాయ నటి సురేఖ వాణి భర్త సురేష్ తేజ సోమవారం మరణించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. సురేష్ తేజ పలు టీవీ షోలకు డైరెక్టర్‌గా పనిచేశారు. సురేఖ, సురేశ్‌లది ప్రేమ వివాహం. సురేఖ టీవీ యాంకర్‌గా ఉన్న సమయంలోనే ఇద్దరూ ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. వీరికి కుమార్తె సుప్రిత ఉన్నారు.
సురేశ్ తేజ దర్శకత్వం వహించిన మా టాకీస్, హార్ట్ బీట్, మొగుడ్స్ పెళ్లామ్స్ లాంటి టీవీ కార్యక్రమాలకు సురేఖ వాణి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. సురేష్ తేజ మరణం పట్ల సినీ, సీరియల్ నటులు సంతాపం వ్యక్తం చేశారు. భర్త మరణంతో విషాదంలో మునిగిపోయిన సురేఖ వాణికి సానుభూతి తెలిపారు.