కోరిక తీరిస్తే.. విజయ్‌ దేవరకొండ సినిమాలో ఛాన్సిస్తా

Actress Shalu Shamu About Metoo For Vijay Devarakonda Movie - Sakshi

మీటూ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి బాలీవుడ్‌, కోలీవుడ్‌ అని తేడా లేకుండా.. అన్ని ఇండస్ట్రీల్లో ప్రకంపనలు సృష్టించింది. అంతమాత్రాన వేధింపులు ఆగుతున్నాయా అంటే చెప్పడం కష్టం. తాజాగా తనకు ఇలాంటి  వేధింపులే ఎదురయ్యాయాని.. డైరెక్టర్‌ కోరికలు తీరిస్తే సినిమాలో అవకాశం ఇస్తానన్నాడని ఓ వర్దమాన నటి తెలిపింది.

కోలీవుడ్‌కు చెందిన నటి షమ్ము సోషల్‌మీడియాలో నెటిజన్లతో ముచ్చటించే క్రమంలో ఓ నెటిజన్‌ అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. తాను కూడా మీటూ బాధితురాలినేని తెలిపింది. అయితే తాను ఇలాంటి వాటిపై ఎవరికీ ఫిర్యాదులు చేయనని, ఇచ్చినా కూడా ఏం లాభం ఉండదని, ఇలాంటి వాటిని ఎలా ఎదుర్కోవాలో తనకు తెలుసునని బదులిచ్చింది. ఓ కొత్త దర్శకుడు తన కోరిక తీరిస్తే.. విజయ్‌ దేవరకొండతో తీసే చిత్రంలో అవకాశం ఇస్తానని అన్నాడని సూటిగా చెప్పేసింది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top