అందుకే ఇప్పట్లో పెళ్లి చేసుకోలేం: నటి

Actress Richa Chadha Opened Up About Her Plans To Marry Ali Fazal - Sakshi

బాలీవుడ్‌ నటి రిచా చద్దా తన వివాహ విషయంపై స్పందించారు. బాయ్‌ఫ్రెండ్‌ అలీ ఫజల్‌ను ఇప్పట్లో పెళ్లి చేసుకోలేనని ప్రకటించారు. ఇందుకు గల కారణాలను కూడా ఆమె తెలిపారు. నటుడు అలీ ఫజల్‌తో హాట్ బ్యూటీ ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన పెళ్లి విషయంపై చర్చించారు. ఇప్పట్లో పెళ్లి చేసుకునే అవకాశాలు లేవని స్పష్టం చేశారు. ఇందుకు వీరి ముందు ఉన్న బీజీ షెడ్యూల్లే కారణమని తెలిపారు. పెళ్లి చేసుకోడానికి ప్రస్తుతం తమ వద్ద సమయం లేదని అన్నారు. పెళ్లికి ఖచ్చితమైన తేది కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.‘‘మాకు టైం లేదు. మార్చిలో నాకు డేట్స్‌ లేవు. మేలో ఎండలు బాగా ఉంటాయి. జూన్‌లో ఇద్దరం సినిమా షూటింగ్‌ చేస్తున్నాం. జూలైలో వర్షాలు ఎక్కువగా పడతాయి. మేము ప్రస్తుతం సంతోషంగా ఉన్నాం. అలాగే పెళ్లి కోసం కూడా ఎదురు చూస్తున్నాం’’. అని వివరణ ఇచ్చారు.(అల్లు అర్జున్‌ కుటుంబంలో విషాదం)

ఇక తన రిలేషన్‌షిప్‌ను అద్భుతమైనదిగా రిచా వర్ణించారు. సినిమా ఇండస్ట్రీలో ఒకే మనస్తత్వంగల వారు దొరకడం చాలా అరుదుగా ఉంటుందని ఆమె తెలిపారు. ఫక్రీ సినిమా షూటింగ్‌లో కలుసుకన్న ఈ జంట 2017 వెనిస్‌లోని ఫిల్మ్‌ ఫెస్టివల్‌ కార్యక్రమంలో తమ ప్రేమ ప్రయాణాన్ని అధికారికంగా ప్రకటించారు. రిచా తాజాగా కంగనా రనౌత్‌ ప్రధాన పాత్రలో నటించిన స్పోర్ట్స్‌ డ్రామా సినిమా ‘పంగా’లో కనిపించనుంది. ఈ మూవీ రేపు( జనవరి 24) విడుదల కానుంది.అలాగే షకీలా బయోపిక్‌ మూవీలోనూ రిచా నటిస్తున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top