నటి మనోరమకు మళ్లీ అస్వస్థత | Actress Manorama hospitalized again | Sakshi
Sakshi News home page

నటి మనోరమకు మళ్లీ అస్వస్థత

Jun 5 2014 8:42 AM | Updated on Apr 3 2019 9:12 PM

నటి మనోరమకు మళ్లీ అస్వస్థత - Sakshi

నటి మనోరమకు మళ్లీ అస్వస్థత

సీనియర్ నటి మనోరమ మళ్లీ అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

చెన్నై : సీనియర్ నటి మనోరమ మళ్లీ అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పలు భాషలలో నాలుగొందలకు పైగా చిత్రాల్లో నటించిన ఆమెను తమిళ పరిశ్రమ ఆచ్చి అని గౌరవంగా పిలుపుకుంటుంది. గత కొంత కాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే.

దాంతో చాలాకాలం నటనకు దూరంగా ఉన్న మనోరమ ఈ మధ్య ఒకటి, రెండు చిత్రాల్లో నటించారు. కొద్దిరోజుల క్రితమం మూత్ర సంబంధ సమస్యతో ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో చేరారు. వైద్యులు ఆమెకు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం మనోరమ కోలుకుంటున్నట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. మరి కొన్ని రోజులు ఆస్పత్రిలోనే ఉండాల్సి వస్తుందని సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement