నాకు నచ్చిన దుస్తులు వేసుకుంటా : హీరోయిన్‌

Actress Malavika Mohanan on Being Trolled For Wearing Shorts - Sakshi

సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సెలబ్రిటీలకు ట్రోలింగ్ బాధలు తప్పటం లేదు. ముఖ్యంగా హీరోయిన్లు చేస్తున్న పోస్టింగ్‌ల విషయంలో నెటిజన్‌లు ఒక్కొక్కరూ ఒక్కోలా స్పందిస్తున్నారు. తాజాగా హీరోయిన్‌ మాళవిక మోహనన్‌ చేసిన ఓ పోస్ట్ విషయంలో నెటిజెన్‌ల స్పందన ఆమెకు కోపం తెప్పించింది.

మలయాళ ఇండస్ట్రీలో పరిచయం అయిన మాళవిక తరువాత తమిళ, హిందీ, కన్నడ చిత్రాల్లోనూ నటించారు. తాజాగా ఈ భామ తన ఇన్స్‌స్టాగ్రామ్‌లో ఓ ఫోటోను చేశారు. అయితే ఈ ఫోటోపై స్పందించిన నెటిజెన్లు.. ‘సాంప్రదాయ కుటుంబంలో పుట్టిన అమ్మాయిలు ఎలాంటి దుస్తులు ధరిస్తారో’ తెలుసా అంటూ కామెంట్ చేశారు.

ఈ కామెంట్‌లపై స్పందించిన మాళవిక మరో ఫోటోను షేర్‌ చేస్తూ ‘ఓ గౌరవ ప్రదమైన అమ్మాయి ఎలా డ్రెస్‌ చేసుకోవాలో చెప్తూ చాలా మంది కామెంట్ చేశారు. అందుకే ఈ ఫోటో నాకు నచ్చిన దుస్తులు ధరించి గౌరవప్రదంగా కూర్చున నా ఫోటో’ అంటూ మరో పోస్ట్ చేశారు. ఇటీవల ‘పేట’ సినిమాతో గుర్తిం‍పు తెచ్చుకున్న మాళవిక త్వరలో విజయ్‌ దేవరకొండ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమవుతున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top