కోలీవుడ్‌కు అమీర | Actress Amira enters to Kollywood | Sakshi
Sakshi News home page

కోలీవుడ్‌కు అమీర

Sep 2 2013 6:47 PM | Updated on Apr 3 2019 6:23 PM

కోలీవుడ్‌కు అమీర - Sakshi

కోలీవుడ్‌కు అమీర

బాలీవుడ్‌కు చెందిన మరో భామ కోలీవుడ్‌కు పరిచయం అవుతోంది. ఇసాక్ హిందీ చిత్రం ద్వారా పాపులర్ అయిన అమీర కోలీవుడ్‌లో ధనుష్ సరసన నటించనుంది.

బాలీవుడ్‌కు చెందిన మరో భామ కోలీవుడ్‌కు పరిచయం అవుతోంది. ఇసాక్ హిందీ చిత్రం ద్వారా పాపులర్ అయిన అమీర కోలీవుడ్‌లో ధనుష్ సరసన నటించనుంది. వీరిద్దరూ రొమాన్స్ చేయనున్న చిత్రానికి అనేగన్ అనే పేరును నిర్ణయించారు. ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రానికి కె.వి.ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. మాట్రాన్ తర్వాత ఈయన దర్శకత్వం వహిస్తున్న చిత్రమిదే. ఈ చిత్రం సోమవారం పుదుచ్చేరిలో ప్రారంభం కానుంది.

కె.వి.ఆనంద్ మాట్లాడుతూ కథానుగుణంగా తనకు 17, 18 ఏళ్ల వయసు గల నటి అవసరమన్నారు. అలాంటి హీరోయిన్ కోసం వెతుకుతున్న సమయంలో అమీర తారస పడిందన్నారు. వెంటనే ఆమెకు ఫొటో సెషన్ నిర్వహించామని చెప్పారు. చిత్రంలోని హీరోయిన్ పాత్రకు అమీర చక్కగా సరిపోతుందని భావించానని తెలిపారు. దీంతో ఆమెను ఎంపిక చేసినట్లు వివరించారు.

అనేగన్ అనేది పక్కా తమిళపదం అన్నారు. తిరువాచకంలో ఈ పదం గురించి చక్కగా వివరించారని పేర్కొన్నారు. అనేగన్ అంటే మల్టిఫుల్ సింగిల్ పర్శన్ అని అర్థమన్నారు.  అనేగన్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ చిత్రమని చెప్పారు. ఈ తరహా చిత్రాన్ని తెరకెక్కించడం తనకిదే తొలిసారి అని పేర్కొన్నారు. ఇందులో సీనియర్ నటుడు కార్తీక్ ముఖ్యపాత్రను పోషిస్తున్నారని వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement