breaking news
Hero Danush
-
తమిళ రాజకీయంలో ‘ధనుష్’ వేడి!
సాక్షి,చెన్నై: ప్రముఖ తమిళ హీరో ధనుష్ కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేయబోతున్నారనే ప్రచారం కోలీవుడ్‌తో పాటు తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర రాజకీయ కాక రేపుతోంది. ధనుష్ తన పార్టీకి సంబంధించి ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. దీనికితోడు, తమిళగ వెట్రి కజగం (టీవీకే) వ్యూహకర్త, సీఎం విజయ్ ప్రధాన అనుచరుడైన ఆదవ్ అర్జున కూడా ధనుష్ పార్టీలో చేరబోతున్నారనే వార్తలకు మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే, టీవీకే పార్టీలో కీలక స్థానంలో ఉన్న ఆదవ అర్జున.. నిజంగానే ధనుష్ పెట్టే కొత్త పార్టీలో చేరుతారా? లేక ఇది ప్రత్యర్థులు ఆడుతున్న మైండ్ గేమా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఏది ఏమైనా, ఈ ప్రచారంతో తమిళనాడు పొలిటికల్ హీట్ ఒక్కసారిగా పెరిగిపోయింది.తమిళనాడు రాజకీయాలపై డీఎంకే సంస్థాగత కార్యదర్శి ఆర్.ఎస్. భారతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు..శాశ్వత మిత్రులుండరు. నాకు సమాచారం అందింది. ఆదవ్ అర్జున.. ధనుష్ పార్టీలో చేరడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. ‘వర్షాకాలం, శీతాకాలం, ఎండాకాలం మారినట్లే ఆదవ్ అర్జున కూడా సీజన్ బట్టి పార్టీలు మారుతుంటారు. ఆయన మా పార్టీలోనే రాజకీయ ఓనమాలు నేర్చుకుని, ఆ తర్వాత విదుతలై చిరుతైగల్ కట్చి (వీసీకే) లోకి, ఇప్పుడు టీవీకేలో ఉన్నారు. ధనుష్ కొత్త పార్టీ పెడితే అందులో చేరే వారిలో మొదటి వరుసలో ఆదవ్ అర్జునే ఉంటారు’అని భారతి ఎద్దేవా చేశారు.మద్దతుదారులు ఆయనను ‘ఆదవ్ అన్నా’ అని సంబోధించడంపై స్పందిస్తూ... ఎవరైనా ఒకరిని అన్నా అని పిలుస్తున్నారంటే, అది వారిని తమ గుప్పిట్లో ఉంచుకోవడానికో లేదా బుజ్జగించడానికే’ అని వ్యాఖ్యానించారు. వీసీకే పార్టీని చక్కదిద్దుతానని చెప్పి దాన్ని ఆర్థికంగా దెబ్బతీశారని, చివరికి అక్కడి కార్యకర్తలను ఊడ్చేసి టీవీకేలో చేర్చారని ఆరోపించారువిజయ్ బాటలోనే ధనుష్ అడుగులు?ఇటీవల చెన్నైలో జరిగిన ఒక రక్తదాన శిబిరంలో ధనుష్ తన అభిమాన సంఘం కోసం ఒక కొత్త జెండాను ఆవిష్కరించడంతో ఆయన రాజకీయ ప్రవేశంపై ఊహాగానాలు మరింత బలపడ్డాయి. కేవలం సినిమా వేడుకలకే పరిమితం కాకుండా, సామాజిక సంక్షేమం,సమాజ సేవపై చురుగ్గా దృష్టి పెట్టాలని, ఒక గొప్ప ప్రయోజనం కోసం ఐక్యంగా పనిచేయాలని ధనుష్ తన అభిమానులను కోరారు.గతంలో టీవీకే అధినేత, సీఎం విజయ్‌కూడా తన రాజకీయ పార్టీని అధికారికంగా ప్రకటించడానికి ముందు ఇదే తరహాలో అభిమాన సంఘాలను సమీకరించి సామాజిక సేవ వైపు మళ్లించారు. దీంతో ధనుష్ కూడా అదే వ్యూహాన్ని అనుసరిస్తున్నారనే చర్చ నడుస్తోంది. పాఠశాల భవనాలకు నిధులు సమకూర్చడం వంటి దాతృత్వ కార్యక్రమాలు కేవలం సేవా దృక్పథంతో చేసినవేనని ధనుష్ వర్గాలు చెబుతున్నప్పటికీ, ఆయన వేస్తున్న అడుగులు మాత్రం త్వరలోనే రాజకీయ రంగప్రవేశానికి సంకేతమని విశ్లేషకులు భావిస్తున్నారు.👉ఇదీ చదవండి : ఎవరు ఎప్పుడు వెన్నుపోటు పొడుస్తారో చెప్పలేం: ధనుష్ -
వారసుడొచ్చాడు.. ఎవరీ ఇన్బన్?
హీరో ధనుష్ లేటెస్ట్ మూవీ 'ఇడ్లీ కడై' అక్టోబర్ 1న ధియేటర్లలో విడుదల కానుంది. తమిళనాడులో ఈ సినిమాను రెడ్ జెయింట్ మూవీస్ విడుదల చేస్తున్నట్టు ధనుష్ 'ఎక్స్'లో వెల్లడించారు. రెడ్ జెయింట్ మూవీస్ సంస్థను ప్రస్తుతం తమిళనాడు డిప్యూటీ సీఎంగా ఉన్న ఉదయనిధి స్టాలిన్ స్థాపించారు. సినిమాల నిర్మాణం, పంపిణీ చేస్తుంటుంది రెడ్ జెయింట్ మూవీస్. అయితే తాజా ప్రకటనలో ఉదయనిధి పేరు లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇన్బన్ ఉదయనిధిని (Inban Udhayanidhi) సమర్పకుడిగా అందులో పేర్కొన్నారు. రెడ్ జెయింట్ మూవీస్ కొత్త సీఈవో అతడేనని వార్తలు వస్తున్నాయి. దీంతో అతడి గురించి ఆరా మొదలైంది.ఎవరీ ఇన్బన్?ఇన్బన్ ఉదయనిధి.. దివంగత మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే మాజీ అధినేత కరుణానిధి (Karunadhini) ముని మనవడు. తమిళనాడు ప్రస్తుత ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌కు మనవడు. డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ కుమారుడు. చిన్న వయసులోనే రెడ్ జెయింట్ మూవీస్ సీఈవోగా బాధ్యతలు భుజానకెత్తుకున్నారు. ఉదయనిధి 2002లో కిరుతిగను వివాహం చేసుకున్నారు. వారి ఇద్దరు పిల్లలు ఇన్బన్, తన్మయ. ప్రస్తుతం ఇన్బన్ వయసు 20 ఏళ్లు.రొనాల్డో ప్రేరణతో..ఫుట్‌బాల్ ఆటగాడైన ఇన్బన్.. భారత ఫుట్‌బాల్ క్లబ్ నెరోకాతో డిఫెండర్‌గా ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత తొలిసారిగా వెలుగులోకి వచ్చాడు. దిగ్గజ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో (Cristiano Ronaldo) ప్రేరణతో అతడు ఫుట్బాట్ను సీరియస్‌గా తీసుకున్నాడు. రియల్ మాడ్రిడ్ టీమ్‌కు వీరాభిమాని అని టైమ్స్ ఇండియా వెల్లడించింది. 'రొనాల్డో ఆటలో దూకుడు, అకింతభావం అంటే నాకెంతో ఇష్టం. రియల్ మాడ్రిడ్ మిడ్‌ఫీల్డర్లు లూకా మోడ్రిక్, సెమిరో తమ జట్టు కోసం పడే శ్రమ నన్ను ఆకట్టుకుంది. రియల్ మాడ్రిడ్ (Real Madrid) మ్యాచ్‌లన్నీ చూస్తాను. వారి ప్రత్యర్థుల మ్యాచ్‌లను కూడా చూస్తాన'ని అతడో సందర్భంలో చెప్పాడు.ప్రేమించడానికి భయపడొద్దుసినిమా పరిశ్రమలో అడుగు పెట్టడానికి చాలా కాలం ముందే ఇన్బన్ వివాదంలో చిక్కుకున్నాడు. ఓ యువతితో తాను కలిసివున్న ఫొటోలు 2023లో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎదుర్కొన్నాడు. అయితే దీని గురించి అతడు ఎక్కడా మాట్లాడలేదు. ఇన్బన్ తల్లి కిరుతిగ ఉదయనిధి (Kiruthiga Udhayanidhi) మాత్రం ట్విటర్లో నర్మగర్భంగా స్పందించారు. 'ప్రేమించడానికి, దాన్ని వ్యక్తీకరించడానికి భయపడవద్దు. ప్రకృతిని అర్థం చేసుకోవడానికి ఇది ఒక మార్గం' అంటూ ఆమె ట్వీట్ చేశారు. కొడుకును వెనుకేసుకొచ్చేలా కిరుతిగ ట్వీట్ ఉందని అప్పట్లో జనాలు అనుకున్నారు. చదవండి: ఆరాటం ముందు ఆటంకం ఎంతహీరో ధనుష్ విషెష్ఇన్బన్ తండ్రి ఉదయనిధి 2012లో 'ఒరు కల్ ఒరు కన్నడి' సినిమాతో నటుడిగా అరంగేట్రం చేశారు. కొన్ని సినిమాల్లో నటించిన తర్వాత ఆయన రాజకీయాల్లోకి ప్రవేశించి ఉప ముఖ్యమంత్రి అయ్యారు. దీంతో తన కుమారుడికి జెయింట్ మూవీస్ బాధ్యతలు అప్పగించినట్టు తెలుస్తోంది. రాజకీయాల్లోనూ, సినిమాల్లోనూ ఘనమైన వారసత్వాన్ని కలిగిన ఇన్బన్ ఎలా ముందుకెళతాడో చూడాలి. కాగా, కొత్త ప్రయాణం విజయవంతం కావాలని ఇన్బన్కు హీరో ధనుష్ (Hero Dhanush) శుభాకాంక్షలు తెలిపారు. రెడ్ జెయింట్ మూవీస్ ప్రస్థానంరెడ్ జెయింట్ మూవీస్ ప్రస్థానం 2008లో ప్రారంభమైంది. విజయ్- త్రిష కాంబినేషన్లో ధరణి తెరకెక్కించిన కురువి సినిమాను ప్రొడక్షన్ హౌస్ మొదట నిర్మించింది. తర్వాత ఆధవన్ (2009), మన్మధన్ అంబు (2010), 7 ఓమ్ అరివు (2011), ఒరు కల్ ఒరు కన్నాడి (2012), నీర్పరావై (2012), వణక్కం చెన్నై (2013), మనితన్ (2016), మామన్నన్ (2023) సినిమాలను నిర్మించింది. కిరుతిగ ఉదయనిధి దర్శకత్వం వహించిన కాదలిక్క నేరమిల్లై, కమల్ హాసన్-మణిరత్నంల థగ్ లైఫ్ సినిమాలను ఈ ఏడాది విడుదల చేసింది. ఇడ్లీ కడై సినిమాను అక్టోబర్ 1న విడుదల చేయబోతోంది. IdliKadai – releasing across Tamil Nadu by @RedGiantMovies_Wishing Inban Udhayanidhi the very best on his new journey! pic.twitter.com/gFUTJgbFwm— Dhanush (@dhanushkraja) September 3, 2025 -
రేడియో మిర్చి కార్యక్రమంలో పాల్గొన్న ధనుష్
-
టాలీవుడ్ పై ధనుష్ పోకస్
-
కోలీవుడ్‌కు అమీర
బాలీవుడ్‌కు చెందిన మరో భామ కోలీవుడ్‌కు పరిచయం అవుతోంది. ఇసాక్ హిందీ చిత్రం ద్వారా పాపులర్ అయిన అమీర కోలీవుడ్‌లో ధనుష్ సరసన నటించనుంది. వీరిద్దరూ రొమాన్స్ చేయనున్న చిత్రానికి అనేగన్ అనే పేరును నిర్ణయించారు. ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రానికి కె.వి.ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. మాట్రాన్ తర్వాత ఈయన దర్శకత్వం వహిస్తున్న చిత్రమిదే. ఈ చిత్రం సోమవారం పుదుచ్చేరిలో ప్రారంభం కానుంది. కె.వి.ఆనంద్ మాట్లాడుతూ కథానుగుణంగా తనకు 17, 18 ఏళ్ల వయసు గల నటి అవసరమన్నారు. అలాంటి హీరోయిన్ కోసం వెతుకుతున్న సమయంలో అమీర తారస పడిందన్నారు. వెంటనే ఆమెకు ఫొటో సెషన్ నిర్వహించామని చెప్పారు. చిత్రంలోని హీరోయిన్ పాత్రకు అమీర చక్కగా సరిపోతుందని భావించానని తెలిపారు. దీంతో ఆమెను ఎంపిక చేసినట్లు వివరించారు. అనేగన్ అనేది పక్కా తమిళపదం అన్నారు. తిరువాచకంలో ఈ పదం గురించి చక్కగా వివరించారని పేర్కొన్నారు. అనేగన్ అంటే మల్టిఫుల్ సింగిల్ పర్శన్ అని అర్థమన్నారు. అనేగన్ రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రమని చెప్పారు. ఈ తరహా చిత్రాన్ని తెరకెక్కించడం తనకిదే తొలిసారి అని పేర్కొన్నారు. ఇందులో సీనియర్ నటుడు కార్తీక్ ముఖ్యపాత్రను పోషిస్తున్నారని వెల్లడించారు.


