మహిళలు మాత్రమే! | Actor Suriya Revealed Jyothika Next Film Magalir Mattum First Look Poster | Sakshi
Sakshi News home page

మహిళలు మాత్రమే!

Oct 12 2016 10:57 PM | Updated on Sep 4 2017 5:00 PM

మహిళలు మాత్రమే!

మహిళలు మాత్రమే!

టైటిల్ చూసి కంగారు వద్దండీ.. మహిళలే కాదు.. మగవాళ్లూ సినిమా చూడొచ్చు. కానీ, టైటిల్ మాత్రం ‘మగళిర్ మట్టుమ్’ అని పెట్టారు.

టైటిల్ చూసి కంగారు వద్దండీ.. మహిళలే కాదు.. మగవాళ్లూ సినిమా చూడొచ్చు.   కానీ, టైటిల్ మాత్రం ‘మగళిర్ మట్టుమ్’ అని పెట్టారు. అంటే... ‘మహిళలు మాత్రమే’ అని అర్థం. జ్యోతిక నటిస్తున్న తాజా చిత్రమిది. ఇందులో ఆమె డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్‌గా నటిస్తున్నారు. జ్యోతిక భర్త, ప్రముఖ తమిళ హీరో సూర్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ‘36 వయదినిలే’లో మధ్య తరగతి మహిళగా సినిమా అంతా చీరల్లోనే కనిపించిన జ్యోతిక తాజా సినిమా కోసం మోడ్రన్ స్టైల్‌లోకి వచ్చేశారు.

ఇందులో భానుప్రియ, ఊర్వశి, శరణ్య.. కీలక పాత్రలు చేస్తున్నారు. కాగా, గతంలో ఇదే టైటిల్‌తో కమల్ ఓ సినిమా నిర్మించి, అతిథి పాత్ర చేశారు. తాజా చిత్రంలో సూర్య అతిథి పాత్రలో కనిపిస్తారని టాక్. ఆ సంగతలా ఉంచితే.. జ్యోతిక సినిమాకి ఈ టైటిల్ పెట్టడానికి పర్మిషన్ కోరుతూ కమల్‌ని సూర్య కలిశారట. కమల్ కాదంటారా!
 

Advertisement
 
Advertisement
Advertisement