బాలీవుడ్‌ నటుడు మృతి | Actor Ranjit Chowdhry Passes Away At 65 | Sakshi
Sakshi News home page

బాలీవుడ్‌ నటుడు మృతి

Apr 16 2020 9:19 AM | Updated on Apr 16 2020 9:28 AM

Actor Ranjit Chowdhry Passes Away At 65 - Sakshi

బాలీవుడ్‌ నటుడు రంజిత్ చౌదరి(65) బుధవారం కన్నుమూశారు. వెండితెరపైనే కాకుండా బుల్లితెరపై నటించిన ఆయన అనారోగ్యంతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. ‘బందిపోట్‌ క్వీన్‌’, ‘బాతోన్‌ బాతోన్‌ మేన్‌’, ‘ఖుబ్సూరత్‌’, ‘మిస్సిస్సిప్పీ మసాలా’ వంటి ఎన్నో సినిమాలలో నటించారు. అంతేగాక హాలీవుడ్‌లోనూ ‘లోన్లీ అమెరికా’తో పాటు మరిన్ని చిత్రాల్లో, టీవీ సిరీయల్స్‌లో నటించిన ఆయన మరణానికి బాలీవుడ్‌, హాలీవుడ్‌ నటులు సోషల్‌ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు.  

అమెరికా టీవీ సిరీస్‌ ‘ప్రిజన్‌ బ్రేక్‌’లో డాక్టర్‌ మార్విన్‌ గుడాట్‌ పాత్రలో రెండు ఎపిసోడ్‌లో నటించారు. దీపా మెహతా ‘సామ్‌ అండ్‌ మి చిత్రానికి’ స్క్రీన్‌ ప్లే కూడా చేశారు. ఆయన మరణానికి బాలీవుడ్ హీరో రాహుల్‌ కన్నా, దర్శకురాలు దీప మెహతా, పూర్ణ జగన్నాథన్‌లు ట్విటర్‌లో నివాళులు అర్పించారు. కాగా గత కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న రంజిత్ చౌదరి ఇటివల శస్త్ర చికిత్స కోసం ఆసుపత్రిలో చేరినట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement