మణి రత్నం చిత్రంలో నాని | Actor Nani Replaces Dulquer Salmaan in Mani Ratnam's Next | Sakshi
Sakshi News home page

మణి రత్నం చిత్రంలో నాని

Oct 10 2015 3:11 AM | Updated on Sep 27 2018 8:48 PM

మణి రత్నం చిత్రంలో నాని - Sakshi

మణి రత్నం చిత్రంలో నాని

టాలీవుడ్ యువ నటుడు నానికి కలిసోచ్చే కాలం నడుస్తోందని చెప్పవచ్చు...

టాలీవుడ్ యువ నటుడు నానికి కలిసోచ్చే కాలం నడుస్తోందని చెప్పవచ్చు. ఆయన నటించిన తెలుగు చిత్రం భలేభలే మగాడివోయ్ చిత్రం సూపర్ హిట్ అయ్యింది. తాజాగా ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో నటించే లక్కీచాన్స్ వరించింది. మణిరత్నం ఓ కాదల్ కణ్మణి వంటి విజయవంతమైన చిత్రం తరువాత తదుపరి చిత్రానికి రెడీ అయిన విషయం తెలిసిందే. రొమాంటిక్ ప్రేమ కథా చిత్రంగా ఓ కాదల్ కణ్మణిని తెరపై ఆవిష్కరించిన మణి ఈ సారి మంచి కమర్షియల్ చిత్రాన్ని రూపొందించనున్నారు.

ఇది రివెంజ్ ఇతి వృత్తంతో తెర కెక్కనుందని తెలిసింది. ఇందులో కార్తీ, దుల్కర్ సల్మాన్ హీరోలుగా నటించనున్నట్లు ప్రచారం జరిగింది.అదే విధంగా నిత్యామీనన్, కీర్తీసురేశ్ హీరోయిన్లుగా ఎంపికయ్యారు.అయితే ఇప్పుడీ చిత్రం నుంచి దుల్కర్‌సల్మాన్ వైదొలగడంతో ఆయన పాత్రలో నటించే అరుదైన అవకాశం నానికి వరించింది. ఇటీవల దర్శకుడు మణిరత్నం నానికి ఫోన్ చేసి చెన్నైకి రప్పించి మరీ అవకాశం ఇచ్చారట.

ఈ చిత్రం డిసెంబర్‌లో ప్రారంభం కానుందని సమాచారం. దీన్ని మణిరత్నం ద్విభాషా చిత్రంగా తెరకెక్కించనున్నారన్నది గమనార్హం. ఇంతకు ముందు నాన్‌ఈ చిత్రంతో కోలీవుడ్‌తో విజయాన్ని అందుకున్న నానికి మణిరత్నం ఏ స్థాయి విజయాన్ని అందిస్తారో కొంత కాలం వేసి చూడాల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement