ఆ విషయం గురించి చెప్పలేను! | Acting on my focus now | Sakshi
Sakshi News home page

ఆ విషయం గురించి చెప్పలేను!

May 9 2016 10:58 PM | Updated on Sep 3 2017 11:45 PM

ఆ విషయం గురించి చెప్పలేను!

ఆ విషయం గురించి చెప్పలేను!

భవిష్యత్తు గురించి చాలామంది చాలా చాలా కలలు కంటారు. అలా ఉండాలని.. ఇలా ఉండాలని ఏవేవో ప్రణాళికలు వేసుకుంటారు.

భవిష్యత్తు గురించి చాలామంది చాలా చాలా కలలు కంటారు. అలా ఉండాలని.. ఇలా ఉండాలని ఏవేవో ప్రణాళికలు వేసుకుంటారు. కానీ, కొంతమంది మాత్రం భవిష్యత్తులో ఎలా ఉండాలి? అనే విషయం గురించి అస్సలు ఆలోచించరు. ప్రస్తుతం బాగున్నామా? లేదా? అన్నదే వాళ్లకి ముఖ్యం. నయనతార రెండో టైప్. ఇటీవల ఓ సందర్భంలో ఐదేళ్ల తర్వాత మీరెలా సెటిల్ అవ్వాలనుకుంటున్నారు? అనే ప్రశ్న నయనతార ముందుంచితే - ‘‘పెళ్లి గురించి అడుగుతున్నారని అర్థమవుతోంది. అయితే, ఆ విషయం గురించి నేనేమీ ఆలోచించలేదు.

ఐదేళ్లలోపే అయిపోవచ్చు... తర్వాత కూడా అవ్వొచ్చు. నాకు వివాహ వ్యవస్థ మీద అపారమైన నమ్మకం ఉంది. కచ్చితంగా పెళ్లి చేసుకుంటాను. కానీ, ఫలానా సమయంలో చేసుకుంటానని టైమ్ ఫిక్స్ చేసి చెప్పలేను. ప్రస్తుతం నా దృష్టంతా యాక్టింగ్ పైనే. రకరకాల పాత్రలు పోషిస్తూ, హ్యాపీగా ఉన్నా’’ అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement