ఈ నెల 20న ‘ఆట గదరా శివ’ సంగీత కచేరీ

Aata Gadara Shiva Divine Musical Sojourn At Hyderabad - Sakshi

ప్రముఖ నటులు, రచయిత తనికెళ్ల భరణి ‘ఆటగదరా శివ’ అనే పేరుతో ఓ పుస్తకాన్ని పాఠకలోకానికి అందించిన విషయం తెలిసిందే. ఈ పుస్తకం ప్రేక్షకాదరణకు నోచుకోవడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇందులోని అంశాలను ఒక్క కార్యక్రమ రూపంలో కూర్పు చేసి దేశవిదేశాలలో ఎన్నో ప్రదర్శనలిచ్చారు. అమెరికా దుబాయ్‌ లాంటి పలు దేశాల్లో భారతీయ వాయిద్యాలతో ‘ఆట గదరా శివ’ను కచేరి తరహాలో ప్రదర్శించారు. అయితే ‘ఆట గదరా శివ’ కచేరీ కార్యక్రమాన్ని అంతర్జాతీయ స్థాయి సంగీత కళాకారుల బృందంతో సింఫనీ తరహాలో ప్రదర్శించేందుకు రంగం సిద్దమైంది. 

ఇవామ్ (ఐడబ్ల్యూఏఎమ్‌) సాంస్కృతిక  సంస్థ అద్వర్యం లో , తెలంగాణ సాంస్కృతిక మరియు పర్యాటక శాఖ సమర్పణలో తనికెళ్ళ భరణి సారథ్యంలో తాళ్లూరి నాగరాజు సంగీత దర్శకత్వంలో మణి నాగరాజ్ ‘ఆటగదరా శివా’ కార్యక్రమం చేపట్టారు. ఫ్లూట్‌ నాగరాజు, డ్రమ్స్‌ శివమణి తదితర ప్రసిధ్ద కళాకరులు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కానున్నారు. పలు విదేశీ వాయిద్య పరికరాలను ఉపయోగించి ఈ కార్యక్రమాన్ని అజరామరంగా మార్చడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఫిబ్రవరి 20న సాయంత్రం 6.30 గంటలకు హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో జరగనుంది. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top