ఇండస్ట్రీలో అది సహజం : ఆమీర్‌ ఖాన్‌ భార్య

Aamir Khan Wife Kiran Rao On Nepotism - Sakshi

నిచ్చెన వెయ్యడం వరకే మనం.. ఎక్కడం పిల్లలే నేర్చుకోవాలి

కిరణ్‌రావ్‌ ఒకప్పుడు ఆమిర్‌ఖాన్‌ భార్య. తప్పుగా అనుకోకండి. ఇప్పుడూ ఆమిర్‌ఖాన్‌ భార్యే. అయితే అంతకుమించిన గుర్తింపునే ఆమె సంపాదించుకున్నారు. ‘ధోబీఘాట్‌’, ‘దంగల్‌’ ‘సీక్రెట్‌ సూపర్‌స్టార్‌’, ‘తలాష్‌’ సినిమాలు సూపర్‌హిట్‌ అయ్యాక, కిరణ్‌రావ్‌కి సూపర్‌హిట్‌ చిత్రాల దర్శక నిర్మాతగా పేరు వచ్చింది. ఏదైనా ఒక దాని మీద ఇండస్ట్రీలో మాటా మాట వచ్చిందంటే.. ‘మనకెందులే’ అని దూరంగా ఉండిపోరు కిరణ్‌. అది ఆమెకు ఉన్న ఇంకో ఐడెంటిటీ. బాలీవుడ్‌లో ఇప్పుడొక టాక్‌ నడుస్తోంది.

నెపోటిజం ముందు పుట్టి బాలీవుడ్‌ తర్వాత పుట్టిందని! నెపోటిజం అంటే బంధుప్రీతి. కొత్తవాళ్లలో ఎంత టాలెంట్‌ ఉన్నా.. నిర్మాతలు గానీ, డైరెక్టర్‌లు గానీ..  సొంతవాళ్లనే పైకి తెస్తుంటారని ఒక అభిప్రాయం ఉంది. ‘‘అవును నిజమే’’ అన్నారు కిరణ్‌! ఏంటి నిజం? అభిప్రాయం ఉండడం నిజం అనా? ‘‘కాదు. బంధుప్రీతి ఉంది అన్న మాట నిజం’’ అని ఆమె అన్నారు. ‘‘ఎక్కడ లేదు చెప్పండి బంధుప్రీతి? అన్నిచోట్లా ఉంది. అలాగే సినిమా ఇండస్ట్రీలోనూ ఉంది. అయితే ఇండస్ట్రీలో మనకు తెలిసినవాళ్లు ఉన్నారని టాలెంట్‌కి పదును పెట్టుకోకుండా ఎవరూ ముందుకు వెళ్లిపోకూడదు. వెళితే ఇబ్బందులు పడతారు. విమర్శలకు నొచ్చుకుంటారు. పిల్లల్ని వాళ్లు కోరుకునేలా తీర్చిదిద్దాలి తప్పితే, వాళ్లు చేయవలసిన వర్క్‌ని కూడా మనమే తీర్చిదిద్దే పని పెట్టుకోకూడదు. చివరికి నిలిచేది మాత్రం టాలెంటే. టాలెంట్‌ ఉంటే మన తరఫున ఎవరూ మాట్లాడనక్కర్లేదు’’ అన్నారు కిరణ్‌రావ్‌. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top