క్లాప్‌కి ఇళయరాజా క్లాప్‌ | Aadhi Pinishetty Clap Telugu Movie Launch | Sakshi
Sakshi News home page

క్లాప్‌కి ఇళయరాజా క్లాప్‌

Jun 13 2019 2:30 AM | Updated on Jul 14 2019 1:28 PM

Aadhi Pinishetty Clap Telugu Movie Launch - Sakshi

ఇళయరాజా, ఆది పినిశెట్టి, ఆకాంక్షా సింగ్, క్రిషా కురుప్‌

విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్న ఆది పినిశెట్టి హీరోగా రూపొందనున్న చిత్రం ‘క్లాప్‌’. ఆకాంక్షా సింగ్‌ కథానాయికగా నటిస్తున్నారు. పృథ్వి ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నారు. రామాంజనేయులు జవ్వాజి సమర్పణలో పృథ్వి బిగ్‌ ప్రింట్‌ పిక్చర్స్‌ అండ్‌ సర్వన్త్‌ రామ్‌ క్రియేషన్స్‌ బ్యానర్లపై ఐబి కార్తికేయన్, యం. రాజశేఖర్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ్‌ భాషల్లో తెరకెక్కనున ్న ‘క్లాప్‌’ చిత్రం బుధవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది.

హీరో, హీరోయిన్లపై చిత్రీకరించిన తొలి సన్నివేశానికి మ్యూజిక్‌ మేస్ట్రో ఇళయరాజా క్లాప్‌ ఇచ్చారు. నిర్మాత అల్లు అరవింద్‌ కెమెరా స్విచ్చాన్‌ చేశారు. తమిళ వెర్షన్‌కు హీరో నాని క్లాప్‌ ఇచ్చారు. దర్శకులు బోయపాటి శ్రీను, గోపీచంద్‌ మలినేని, ‘బొమ్మరిల్లు’ భాస్కర్‌ తదితరులు ‘క్లాప్‌‘ బౌండెడ్‌ స్క్రిప్ట్‌ని చిత్రబృందానికి అందించారు. ఆది పినిశెట్టి మాట్లాడుతూ– ‘‘పృథ్వి ఆదిత్య కథ చెప్పగానే ఇంప్రెస్‌ అయ్యి వెంటనే ఓకే చెప్పాను. స్పోర్ట్స్‌ బ్యాక్‌ డ్రాప్‌లో ఇప్పటివరకూ వచ్చిన సినిమాలకంటే మా సినిమా చాలా వైవిధ్యంగా ఉంటుంది.

రెండు షేడ్స్‌ ఉన్న పాత్రల్లో నటిస్తున్నాను’’ అన్నారు. ‘‘ఈ కథపై ఏడాది వర్క్‌ చేశాను. అథ్లెటిక్‌ స్పోర్ట్స్‌ నేపథ్యంలో చిత్రకథ సాగుతుంది’’ అన్నారు పృథ్వి ఆదిత్య. ‘‘మిత్రుడు రాజశేఖర్‌ ఈ ప్రాజెక్ట్‌ గురించి చెప్పాడు.. కథ విని ఇంప్రెస్‌ అయి ఈ చిత్రంలో భాగమయ్యాను. ఇళయ రాజాగారి మ్యూజిక్‌ ఈ చిత్రానికి బిగ్‌ ఎస్సెట్‌ కానుంది. ఈ నెల 17నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభిస్తాం. హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు, మధురైలలో షూటింగ్‌ జరుపుతాం. నాలుగు షెడ్యూల్స్‌లో ఈ చిత్రాన్ని పూర్తి చేయనున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఇళయరాజా, కెమెరా: ప్రవీణ్‌ కుమార్, సహ నిర్మాతలు: ఫై.ప్రభ ప్రేమ్, జి.మనోజ్, జి.శ్రీహర్ష.

Advertisement
 
Advertisement
Advertisement