సినిమా షూటింగ్ లో అపశ్రుతి | A Technician dies on the set of movie Pari | Sakshi
Sakshi News home page

సినిమా షూటింగ్ లో అపశ్రుతి

Aug 30 2017 10:55 PM | Updated on Sep 17 2017 6:09 PM

సినిమా షూటింగ్ లో అపశ్రుతి

సినిమా షూటింగ్ లో అపశ్రుతి

బాలీవుడ్‌ నటి అనుష్క శర్మ ప్రధాన పాత్రలో నటిస్తున్న మూవీ ‘పారి’. ఈ మూవీని అనుష్క తన సొంత నిర్మాణ సంస్థలో తెరకెక్కిస్తున్నారు.

ముంబయి: బాలీవుడ్‌ నటి అనుష్క శర్మ ప్రధాన పాత్రలో నటిస్తున్న మూవీ ‘పారి’. ఈ మూవీని అనుష్క తన సొంత నిర్మాణ సంస్థలో తెరకెక్కిస్తున్నారు. అయితే మూవీ షూటింగ్ లో అపశృతి చోటుచేసుకుంది. మంగళవారం కరెంట్ షాక్ తో టెక్నీషియన్ ఎస్‌హెచ్ శాహబే అలాం మృతిచెందడంతో మూవీ యూనిట్ సంతాపం ప్రకటించారు. అతడు లైటింగ్ డిపార్ట్ మెంట్ లో భాగంగా పనిచేస్తున్నారు.
 
‘ప్రోసిట్‌ రాయ్‌ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం కాబోతున్న ఈ మూవీ షూటింగ్ మంగళవారం జరగుతుండగా దురదృష్టవశాత్తూ ఈ ఘటన జరిగింది. కరెంట్ షాక్ వల్ల లైటింగ్‌ డిపార్ట్‌మెంట్‌కు చెందిన మా సిబ్బంది శాహబేను కోల్పోయాం. వెంటనే చికిత్స అందించినా సహచరుడిని కాపాడుకోలేకపోయాం. కష్ట కాలంలో మూవీ యూనిట్, మేము బాధితుడి కుటుంబానికి అండగా ఉంటామని’  క్లీన్ స్టేట్ ఫిల్మ్స్ కో ఓనర్ కర్ణేశ్ శర్మ బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement