ఇది చాలా తక్కువ! | 90ML Movie Trailer Launch Event | Sakshi
Sakshi News home page

ఇది చాలా తక్కువ!

Apr 8 2019 3:55 AM | Updated on Apr 8 2019 3:55 AM

90ML Movie Trailer Launch Event - Sakshi

ఓవియా

తమిళ బిగ్‌బాస్‌ ఫేమ్‌ ఓవియా ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘90ఎంఎల్‌’. ‘ఇది చాలా తక్కువ’ అన్నది ట్యాగ్‌లైన్‌. అనితా ఉదీప్‌  దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో  శింబు ప్రత్యేక పాత్రలో కనిపించి, సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని అదే టైటిల్‌తో పఠాన్‌ చాంద్‌బాషా తెలుగులో రిలీజ్‌ చేస్తున్నారు. ఈ చిత్రం టీజర్‌ను ఆదివారం రిలీజ్‌ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన సాయి వెంకట్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ తమిళంలో హిట్‌ అయినట్టే తెలుగులోనూ హిట్‌ సాధించాలని అన్నారు.

నిర్మాత చాంద్‌బాషా మాట్లాడుతూ – ‘‘తెలుగు హక్కుల కోసం చాలా పోటీ ఏర్పడింది. మేం దక్కించుకున్నాం.  కామెడీ డ్రామాగా సాగే చిత్రమిది’’ అన్నారు.  ‘‘ఐదుగురు అమ్మాయిలు.. వాళ్లకు ఎదురైన సమస్యల వల్ల మద్యపానం, ధూమపానానికి అలవాటు పడి ఎలా బయటపడ్డారన్నది కథ. శింబు స్పెషల్‌ రోల్, సంగీతం ఆకట్టుకుంటుంది’’ అన్నారు నిర్మాణ సారథి కృష్ణ కాకర్లమూడి. ఈ కార్యక్రమంలో డా. రంగనాయకులు, శ్రీధర్, వాసుదేవ్‌ వైజాగ్‌ దివాకర్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement