47 రోజుల్లో ఏం జరిగింది? | 47 Days Motion Poster release | Sakshi
Sakshi News home page

47 రోజుల్లో ఏం జరిగింది?

Nov 9 2017 12:31 AM | Updated on Nov 9 2017 5:46 AM

47 Days Motion Poster release - Sakshi

47 డేస్‌లో ఏం జరిగింది? ఇద్దరి మధ్య ప్రేమా? మర్డర్‌ మిస్టరీనా? తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే అంటున్నారు దర్శకులు ప్రదీప్‌ మద్దాలి. ‘జ్యోతిలక్ష్మీ’, ‘ఘూజీ’ వంటి చిత్రాలతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సత్యదేవ్‌ హీరోగా నూతన దర్శకుడు ప్రదీప్‌ మద్దాలి రూపొందిస్తున్న చిత్రం ‘47 డేస్‌’. ‘ది మిస్టరీ అన్‌ఫోల్డ్స్‌’ అనేది ఉపశీర్షిక. పూజా ఝవేరి కథానాయిక. దబ్బార శశిభూషణ్‌ నాయుడు, రఘు కుంచె, శ్రీధర్మక్కువ, విజయ్‌ శంకర్‌ డొంకాడ నిర్మిస్తున్నారు.

ఈ సినిమా మోషన్‌ పోస్టర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ‘‘మోషన్‌ పోస్టర్‌ ఇంట్రెస్టింగ్‌గా ఉందని అందరూ మెచ్చుకుంటున్నారు. మంచి రెస్పాన్స్‌ వస్తోంది. స్క్రీన్‌ప్లే ఆడియన్స్‌కు థ్రిల్లింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఇస్తుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ‘‘హీరోగా సత్యదేవ్‌కు ఈ సినిమా మంచి బ్రేక్‌ అవుతుంది. త్వరలోనే ట్రైలర్‌ను రిలీజ్‌ చేస్తాం’’ అన్నారు నిర్మాతలు. రోషిణి, రవివర్మ, హరితేజ, ఇర్ఫాన్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి రఘుకుంచె స్వరకర్త.

Advertisement
 
Advertisement
Advertisement