ఇది బూతు సినిమా కాదు | 24 Kisses Movie Press Meet | Sakshi
Sakshi News home page

ఇది బూతు సినిమా కాదు

Nov 23 2018 5:47 AM | Updated on Nov 23 2018 5:47 AM

24 Kisses Movie Press Meet - Sakshi

అయోధ్య కుమార్, హెబ్బా పటేల్, అదిత్‌

‘‘24 కిస్సెస్‌ అనగానే చాలా మంది బూతు సినిమా అనుకుంటున్నారు. కానే కాదు. అన్ని రకాల ఎమోషన్స్‌ ఉన్న అందమైన ప్రేమకథ’’ అన్నారు దర్శకుడు అయోధ్యకుమార్‌ కృష్ణంశెట్టి. అరుణ్‌ అదిత్, హెబ్బా పటేల్‌ జంటగా అయోధ్యకుమార్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘24 కిస్సెస్‌’. సంజయ్‌రెడ్డి, అనిల్‌ పల్లాల నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా అయోధ్యకుమార్‌ మాట్లాడుతూ– ‘‘మిణుగురులు’ లాంటి మంచి సినిమా తీసిన నా నుండి వల్గర్‌ మూవీ రాదు.

‘మిణుగురులు’ టీమ్‌ నుంచి వస్తోన్న మరో అద్భుతమైన చిత్రమిది. కమర్షియల్‌ ఎలిమెంట్స్‌తో తెరకెక్కించిన క్లాసికల్‌ లవ్‌స్టోరీ 24 కిస్సెస్‌. ఇందులో ఒక్క డబుల్‌ మీనింగ్‌ డైలాగ్‌ కూడా ఉండదు. అందరూ కలిసి చూడదగ్గ సినిమా ఇది’’ అన్నారు. ‘‘సినిమా రిలీజ్‌ కోసం చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నాను. ఎగై్జట్‌మెంట్‌తో పాటు నెర్వస్‌గా ఉంది. మంచి రిజల్ట్‌ వస్తుందన్న నమ్మకం ఉంది’’అన్నారు హెబ్బా పటేల్‌. ‘‘రిలీజైన ట్రైలర్‌కి, సాంగ్స్‌కి మంచి స్పందన లభిస్తోంది. మర్చిపోలేని ప్రేమకథా చిత్రమిది. ప్రేక్షకులకు మంచి సినిమా చూసిన అనుభూతి కలుగుతుంది’’ అన్నారు అరుణ్‌.

Advertisement
 
Advertisement
Advertisement