అల్లు అర్జున్ కెరీర్లో ఫస్ట్ టైం..! | 20 crore Nizam Share for Dj duvvada Jagannadham | Sakshi
Sakshi News home page

అల్లు అర్జున్ కెరీర్లో ఫస్ట్ టైం..!

Jul 6 2017 12:07 PM | Updated on Sep 5 2017 3:22 PM

అల్లు అర్జున్ కెరీర్లో ఫస్ట్ టైం..!

అల్లు అర్జున్ కెరీర్లో ఫస్ట్ టైం..!

అల్లు అర్జున్, హరీష్ శంకర్ల కాంబినేషన్లో తెరకెక్కిన డీజే దువ్వాడ జగన్నాథమ్, ట్రేడ్ పండితుల అంచనాలను

అల్లు అర్జున్, హరీష్ శంకర్ల కాంబినేషన్లో తెరకెక్కిన డీజే దువ్వాడ జగన్నాథమ్, ట్రేడ్ పండితుల అంచనాలను తలకిందులు చేస్తోంది. తొలి రోజు నుంచే డివైడ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా కలెక్షన్ల విషయంలో మాత్రం సంచలనాలు నమోదు చేస్తోంది. ఇప్పటికే 100 కోట్ల గ్రాస్తో రికార్డ్ సృష్టించిన డీజే, ఇప్పుడు మరో రికార్డ్ను సొంతం చేసుకున్నాడు.

బన్నీ కెరీర్లోనే తొలిసారిగా డీజే దువ్వాడ జగన్నాథమ్ సినిమాతో  నైజాంలో 20 కోట్ల షేర్ సాధించి రికార్డ్ సృష్టించాడు. దర్శకుడు హరీష్ శంకర్ ఈ రికార్డ్ సాధించటం ఇది రెండో సారి. గతంలో గబ్బర్సింగ్ సినిమాతో 20 కోట్లకు పైగా షేర్ సాధించిన హరీష్ శంకర్, డీజేతో మరోసారి అదే ఫీట్ను రిపీట్ చేశాడు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికీ మంచి వసూళ్లు సాధిస్తున్న డీజే, ముందు ముందు ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తాడో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement