ముంబై బీచ్‌కు కొట్టుకొచ్చిన వేల్‌ | 40 Feet Whale Carcass Washes Ashore In Mumbai | Sakshi
Sakshi News home page

ముంబై బీచ్‌కు కొట్టుకొచ్చిన వేల్‌

Jun 14 2018 7:50 PM | Updated on Jun 14 2018 7:50 PM

40 Feet Whale Carcass Washes Ashore In Mumbai - Sakshi

ముంబై : నవీ ముంబైలోని ఖర్‌ దాండా తీరానికి 40 అడుగుల పొడవైన వేల్ శవమై కొట్టుకువచ్చింది. గురువారం ఉదయం వేల్‌ మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న అధికారులు మరణించింది బ్లూ వేల్‌ అని వెల్లడించారు. గత మూడేళ్లలో ఇప్పటివరకూ మొత్తం ఎనిమిది సార్లు ఇలా మహారాష్ట్ర తీరానికి వేల్‌ మృతదేహాలు కొట్టుకొచ్చాయి.

చనిపోయిన వేల్‌ టిష్యూలను మహారాష్ట్ర అధికారులు సేకరించారు. వేల్‌ దాదాపు 20 టన్నులకుపైగా బరువు ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు. చనిపోయి చాలాకాలం అవుతుండటం వల్ల బ్లూ వేల్‌ దేహం రంగు మారిందని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement