‘తెలంగాణలో బస్తీ దవాఖానాలు’

Telangana govt to set up basti dawakhanas - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బస్తీ దవాఖానాలను విస్తరిస్తామని వైద్యశాఖ మంత్రి సి. లక్ష్మారెడ్డి తెలిపారు. మొట్టమొదట హైదరాబాద్ లో 50 బస్తీ దవాఖానాల ఏర్పాటు చేస్తామని, ఈనెలలో పాతబస్తీలో 4 బస్తీ దవాఖానాలను ప్రారంభిస్తామని చెప్పారు. బస్తీ దవాఖానాల కోసం డాక్టర్ల నియామకం చేపడతామని, కొత్తగా 4 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా నేతృత్వంలో మంగళవారం జరిగిన ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండ‌ర్డ్ అథారిటీ స‌మావేశానికి ఆయన హాజరయ్యారు.

ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. ఆహార భద్రతకు సంబంధించి కీలక అంశాలపై సమావేశంలో చర్చించినట్టు తెలిపారు. ఇక నుంచి హోటళ్లు, ‌ఆహార పరిశ్రమలకు గ్రేడింగ్ ఇస్తామని.. స్టార్ హోటళ్లతరహాలో వర్గీకరిస్తామని చెప్పారు. సిద్ధిపేట-మహబూబ్‌నగర్, నల్గొండ-సూర్యాపేటలో జిల్లాలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసేందుకు నిధులు కేటాయించాలని జేపీ నడ్డాను కోరినట్టు వెల్లడించారు. బీబీ నగర్‌ ఎయిమ్స్‌, జిల్లా ఆస్పత్రులకు నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశామన్నారు.

Read latest Mahabubnagar News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top