
సాక్షి, నారాయణపేట: విద్యార్థి జీవితం నుంచి ఆటలపై ఆసక్తి కలిగి ఉంటే వృద్ధాప్యం వరకు ఆరోగ్యకరమైన జీవనాన్ని గడవచ్చని నెహ్రూ యువజన కేంద్రం (ఎన్‌వైకే) జాతీయ ఉపాధ్యక్షుడు శేఖర్‌జీ అన్నారు. నారాయణపేటలోని సిటిజన్ క్లబ్ ఆవరణలో గత రెండు రోజులుగా నిర్వహిస్తున్న నియోజకవర్గ స్థా యి కబడ్డీ పోటీల ముగింపు సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం 154 రకాల పథకాలు అం దిస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి పలు పథకాల్లో కేంద్రం తన వాటాను అందిస్తూ ఆదుకుంటుందన్నారు.
గ్రామీణ అభివృద్ధికి ప్రథమ ప్రాధాన్యతను అందిస్తూ మోదీ ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. ప్రతిభకలిగిన విద్యార్థులను ప్రోత్సహిస్తూ, చదువుతోపాటు క్రీడల అభివృద్ధి సాధించేలా నిధుల కేటాయింపు జరుగుతుందన్నారు. అనంతరం విజేత లు ఎస్‌ఎల్‌డీసీ విద్యార్థులకు, దామరగిద్ద తండా యువకుల బృందానికి బహుమతులు అందించారు. కార్యక్రమంలో తపస్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్, బీజేపీ రాష్ట్ర నాయకులు రతంగపాండురెడ్డి, జిల్లా అధ్యక్షురాలు పద్మజారెడ్డి, ïఎస్‌సీఐ రాష్ట్ర డైరెక్టర్ సత్యయాదవ్, పీఈటీ రమణ, ప్రశాంత్, ప్రిన్సిపాల్ శేఖర్‌రెడ్డి, నాయకులు రఘురామయ్యగౌడ్, వినోద్, గౌతమి, లక్ష్మణ్, సత్యభాస్కర్‌రెడ్డి, ఆంజనేయులు, అనంతసేన, ఈదప్ప, రాజేందర్‌సింగ్ పాల్గొన్నారు.