Sakshi World of Love: Telugu Love Failure Story | అతనంటే పిచ్చి ప్రేమ! ఎంతంటే..- Sakshi
Sakshi News home page

అతనంటే పిచ్చి ప్రేమ! ఎంతంటే.. 

Oct 5 2019 10:13 AM | Updated on Oct 30 2019 5:35 PM

Woman Failure Love Story - Sakshi

నేను ఇంటర్‌లో ఉన్నపుడు శశాంక్‌ అనే ఓ అబ్బాయిని ప్రేమించాను. తను డిగ్రీ! నా సూపర్‌ సీనియర్‌. డైలీ నేను అతన్ని చూసేదాన్ని! అతడి కోసమే కాలేజ్‌కు వెళ్లేదాన్ని. కానీ, ఏ రోజూ అతనితో మాట్లాడలేదు. చూస్తుండగానే నా ఇంటర్‌, అతని డిగ్రీ పూర్తయ్యాయి. చివరిరోజు కాలేజీలో ఫేర్‌వెల్‌ పార్టీ జరిగింది. ఆ రోజు పార్టీ ముగించుకుని ఇంటికి తిరిగి వస్తునపుడు శశాంక్‌ నా ముందుకు వచ్చి నిలబడ్డాడు. నేను ఆశ్చర్యపోయాను.. ఆనందంగానూ అనిపించింది. అతను ఏమీ మాట్లాడకుండా తన ఫోన్‌ నెంబర్‌ ఇచ్చి వెళ్లిపోయాడు. అలా మా మధ్య మాటలు కలిశాయి. ఆ మాటల సందర్భంలో తను ఎప్పుడు నాకు ప్రపోజ్‌ చేశాడో.. నేనెప్పుడు ఓకే చెప్పానో గుర్తులేదు. శశాంక్‌ అంటే నాకు పిచ్చిప్రేమ! ఏంతంటే మాటల్లో చెప్పలేనంత.

అందరు ప్రేమికుల్లానే మేము ఎన్నో కలలు కన్నాం. పెళ్లితో మా ప్రేమ బంధాన్ని శాశ్వతం చేసుకుందామనుకున్నాం. కొద్దిరోజులకే మా ప్రేమను దురదృష్టం​ వెంటాడింది. చివరకు కొన్ని అనివార్య కారణాలవల్ల నేను శశాంక్‌కు దూరంగా ఉండాల్సి వచ్చింది. ఆ తర్వాత మా అమ్మానాన్నలు చూసిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు తనెక్కడున్నాడో నాకు తెలియదు. కానీ, నేను అతను ఒకే చూరుకింద(ఒకే చోట) ఉన్నామని తలుచుకున్నపుడు మనసంతా సంతోషంగా అనిపిస్తుంది! విడిపోయినందుకు బాధగానూ ఉంటుంది.
- కళ్యాణి ( పేర్లు మార్చాం)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement