దుర్గమ్మను దర్శించుకున్న ప్రముఖులు | vips in indrakeeladri | Sakshi
Sakshi News home page

దుర్గమ్మను దర్శించుకున్న ప్రముఖులు

Jan 8 2018 10:27 AM | Updated on Jan 8 2018 10:27 AM

సాక్షి, విజయవాడ: దుర్గగుడిలో కనకదుర్గమ్మను పలువురు ప్రముఖులు ఆదివారం దర్శించుకున్నారు. ఢిల్లీ హైకోర్టు జడ్జి ప్రతిభరాణి దంపతులు, రాష్ట్ర హైకోర్టు జడ్జి సురే్‌షకుమార్‌ కైట్‌ దంపతులు, రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌, తెలంగాణ రాష్ట్ర స్పీకర్‌ సిరికొండ మధుసూదన్‌చారి, రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్‌, దుర్గగుడి అదనపు ఈవో వై.వి.అనురాధ ఉన్నారు.

ఆలయ అధికారులు, అర్చకులు వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర‍్శన ఏర్పాట్లు చేశారు. ఆశీర్వచన మండపంలో వేదపండితులు వారికి అమ్మవారి ఆశీస్సులు అందజేశారు. అనంతరం అధికారులు వారికి అమ్మవారి చిత్రపటం, లడ్డూ ప్రసాదం, శేషవస్త్రం బహుకరించారు.

Advertisement
 
Advertisement
Advertisement