
ప్రముఖ నటి తమన్నా సోమవారం ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆమెకు వేదపండితులు ఆశీర్వచనం అందజేశారు.
ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను సినీనటి తమన్నా సోమవారం దర్శించుకున్నారు. తల్లితో కలిసి అమ్మవారి దర్శనానికి విచ్చేసిన ఆమెకు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించిన అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందజేయగా, ఆలయ అధికారులు అమ్మవారి ప్రసాదాలు ఇచ్చారు. తిరిగి వెళ్తున్న తమన్నాతో ఫొటోలు దిగేందుకు భక్తులతో పాటు ఆలయ అధికారులు, సిబ్బంది పోటీపడ్డారు. తమన్నాను చూసిన భక్తులు ‘అవంతిక.. అవంతిక’ అంటూ కేకలు వేశారు.