31న ట్రాఫిక్‌ ఆంక్షలుంటాయ్‌ | police restrictions on New Year celebrations | Sakshi
Sakshi News home page

Dec 29 2017 1:08 PM | Updated on Oct 17 2018 4:29 PM

విజయవాడ: నూతన సంవత్సరం సందర్భంగా ఈనెల 31వ తేదీన డ్రంకన్‌ డ్రైవ్‌ నిర్వహిస్తామని డీసీపీలు కాంతి రాణా, గజరావ్‌ భూపాల్‌రావులు శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో తెలిపారు. ఆ రోజున రోడ్లపై ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని, హైస్పీడ్ డ్రైవింగ్, ట్రిపుల్ డ్రైవింగ్ చేయొద్దని వాహనదారులకు సూచనలు చేశారు. నగరంలో బైక్ ర్యాలీలకు అనుమతి లేదని, పోలీసుల అనుమతితోనే నూతన సంవత్సర వేడుకలు నిర్వహించాలన్నారు.

హాస్పటల్స్‌ సమీపంలో నూతన సంవత్సర వేడుకలకు అనుమతి ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. నూతన సంవత్సరం రోజున రూరల్ ఏరియాలో కోడి పందేలు, పేకాట నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే లాటరీలు వస్తున్నాయని ఫోన్ కాల్స్ వస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని వారు సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement