ప్రజా నాయకుల ఎన్‌కౌంటర్లు బూటకం | public leaders Encounters is Depravity | Sakshi
Sakshi News home page

ప్రజా నాయకుల ఎన్‌కౌంటర్లు బూటకం

Mar 5 2018 11:02 AM | Updated on Mar 5 2018 11:02 AM

public leaders Encounters is Depravity - Sakshi

ఖమ్మంమయూరిసెంటర్‌:  ప్రజా నాయకులను హత్యలు చేసి ఎన్‌కౌంటర్లు పేరు చెప్పడం బూటకమని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు నాగన్న ఆరోపించారు. ఆదివారం స్థానిక రామనర్సయ్య విజ్ఞాన కేంద్రంలో అరుణోదయ జిల్లా కమిటీ సమావేశం సుబ్బారావు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా నాగన్న మాట్లాడుతూ దేశ సంపదను బ్యాంకుల నుంచి దోచుకునే వారి పట్ల ఉదాసినంగా వ్యవహరిస్తున్న పాలకులు, ప్రజలు కోసం, దేశం కోసం పోరాడుతున్న వారిని హత్యలు చేయడం దుర్మార్గం అన్నారు.

రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రజల అభిప్రాయాలకు విరుద్ధంగా వ్యవహరిస్తుందన్నారు. రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన హామీలు ఇప్పటికైనా సంపూర్ణ స్థాయిలో ప్రభుత్వం అమలుకు పూనుకోవాలన్నారు. రాబోయే ఎన్నికల్లో కళాకారులు తగిన గుణపాఠం చెప్తారన్నారు. ఈ కార్యక్రమంలో అరుణోదయ జిల్లా కార్యదర్శి లక్ష్మణ్, నాయకులు జీవన్, కృష్ణమూర్తి, నాగేశ్వరరావు, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement