అంత నిర్లక్ష్యం ఎందుకో..? | officers Neglect of Mining villages | Sakshi
Sakshi News home page

అంత నిర్లక్ష్యం ఎందుకో..?

Jan 21 2018 12:12 PM | Updated on Jan 21 2018 12:12 PM

చుంచుపల్లి:   ఖమ్మం జిల్లాలో మైనింగ్‌ నిధులు పుష్కలంగా ఉన్నా.. అధికారుల నిర్లక్ష్యంతో ప్రభావిత గ్రామాలు అభివృద్ధికి నోచుకోవడం లేదని ఈనెల 9న ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన జిల్లా యంత్రాంగం ఎట్టకేలకు శనివారం మినరల్‌ ఫౌండేషన్‌ సమావేశం ఏర్పాటు చేసింది. సమావేశానికి మంత్రి తుమ్మల నాగేశ్వరావు హాజరై ఇప్పటి వరకు మినరల్‌ ద్వారా జమ అయిన నిధుల వివరాలను తెలిపారు. రూ.290 కోట్లతో  జిల్లా వ్యాప్తంగా ప్రభావిత గ్రామాలలో నెలకొన్న మౌలిక వసతులను గుర్తించి వాటికి ఖర్చు వేయాలని అధికారులను ఆదేశించారు. 

Advertisement
 
Advertisement
Advertisement