కొత్త ట్రెండ్ సృష్టించిన జూ జీన్స్! | Zoo Jeans see lions, tigers and bears designg denim clothes for zoo charity | Sakshi
Sakshi News home page

కొత్త ట్రెండ్ సృష్టించిన జూ జీన్స్!

Jul 9 2016 3:28 PM | Updated on Oct 1 2018 1:12 PM

కొత్త ట్రెండ్ సృష్టించిన జూ జీన్స్! - Sakshi

కొత్త ట్రెండ్ సృష్టించిన జూ జీన్స్!

ఫ్యాషన్ డిజైనింగ్ లో మనుషులు మాత్రమే కాదు జంతువులు రాణిస్తున్నాయి. అదేంటీ వాటికి డిజైన్ల గురించి ఏం తెలుసు అని సందేహం అక్కర్లేదు.

టోక్యో: ఫ్యాషన్ డిజైనింగ్ లో మనుషులు మాత్రమే కాదు జంతువులు రాణిస్తున్నాయి. అదేంటీ వాటికి డిజైన్ల గురించి ఏం తెలుసు అని సందేహం అక్కర్లేదు. ఆ వివరాలపై ఓ లుక్కేద్దాం మరి. నటకిరీటీ రాజేంద్రప్రసాద్ నటించిన 'ఆ ఒక్కడీ అడక్కు' మూవీ తెలుసు కదండీ. అందులో నష్టాల్లో ఉన్న బట్టల కంపెనీని రాజేంద్రప్రసాద్ లీజుగా తీసుకుని భిన్న రకమైన షర్ట్స్, ప్యాంట్స్ డిజైన్లను తయారుచేయిస్తాడు. సిగరెట్లతో చొక్కాలకు రంద్రాలు చేయడం, పాన్ మసాలా లాంటివి తిని డ్రెస్సుపై  రంగు పడేలా చేయడం, సింగిల్ షోల్డర్ చొక్కాలు చేసి కొత్త ట్రెండ్ తీసుకొచ్చి లాభాలు తీసుకొస్తాడు.

ప్రస్తుతం జపాన్ వాళ్లు ఇలాంటి ఫార్ములాను వాడుతున్నారు. జూ టీన్స్ పేరుతో బ్రాండింగ్ జీన్స్ అమ్ముతున్నారు. పులులు, సింహాలు, కొన్ని రకాల ఎలుగుబంట్లు అక్కడి ఓ జూలో ఉంటున్నాయి. అయితే జూ జీన్స్ వాళ్లు జూ వాళ్ల సహకారంతో జీన్స్ ప్యాంట్లు కుట్టేందుకు వాడే ముడిసరకును కారు, జీపు టైర్లకు, ఫుట్ బాల్స్ కు పూర్తిగా చుట్టేసి పార్కులోని జంతువుల మధ్య పడవేస్తారు. ఆ వెంటనే పులులు, సింహాలు ఆ జీన్స్ ముడిసరుకును చీల్చి చెండాడుతాయి. దీంతో బట్ట చాలా చోట్లు చీరుకుపోయినట్లుగా తయారవుతుంది.

జూ జీన్స్ సంస్థ వాళ్లు ఆ ముడిసరుకును మళ్లీ సేకరించి ప్యాంట్లు, కొన్ని మోడల్ జీన్స్ షర్టులను రూపొందిస్తారు. ఆ తర్వాత జూ జీన్స్ బ్రాండ్ పేరుతో మార్కెట్లోకి తీసుకొస్తారు. ఈ విధానం మొదలుపెట్టిన తర్వాత అమ్మకాలు విపరీతంగా పెరిగిపోయాయని నిర్వాహకులు చెబుతున్నారు. ఈ జంతువులను గౌరవించేందుకు పులుల సాయంతో చేసిన డ్రెస్సులకు టీ1, లయన్స్ తో అయితే ఎల్1, ఎలుగుబంట్లు రబ్ చేసిన వాటి  జంతువుల సహాయంతో డిఫరెంట్ ప్రాసెస్ వాడుతున్నారని తెలిసే కస్టమర్లు వీటిని కొనుగోలు చేయడం విశేషం.

ఈ నెల 6 నుంచి 21 వరకూ హిటాచీ నగరంలో ఉత్పత్తులను అమ్మి, వచ్చే లాభాలను కమైన్ జూతో పాటు మరో సంస్థకు విరాళం ఇవ్వనున్నట్లు జీన్స్ సంస్థ ఉద్యోగి తెలిపారు.



Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement