breaking news
Tigers and Bears
-
కొత్త ట్రెండ్ సృష్టించిన జూ జీన్స్!
టోక్యో: ఫ్యాషన్ డిజైనింగ్ లో మనుషులు మాత్రమే కాదు జంతువులు రాణిస్తున్నాయి. అదేంటీ వాటికి డిజైన్ల గురించి ఏం తెలుసు అని సందేహం అక్కర్లేదు. ఆ వివరాలపై ఓ లుక్కేద్దాం మరి. నటకిరీటీ రాజేంద్రప్రసాద్ నటించిన 'ఆ ఒక్కడీ అడక్కు' మూవీ తెలుసు కదండీ. అందులో నష్టాల్లో ఉన్న బట్టల కంపెనీని రాజేంద్రప్రసాద్ లీజుగా తీసుకుని భిన్న రకమైన షర్ట్స్, ప్యాంట్స్ డిజైన్లను తయారుచేయిస్తాడు. సిగరెట్లతో చొక్కాలకు రంద్రాలు చేయడం, పాన్ మసాలా లాంటివి తిని డ్రెస్సుపై రంగు పడేలా చేయడం, సింగిల్ షోల్డర్ చొక్కాలు చేసి కొత్త ట్రెండ్ తీసుకొచ్చి లాభాలు తీసుకొస్తాడు. ప్రస్తుతం జపాన్ వాళ్లు ఇలాంటి ఫార్ములాను వాడుతున్నారు. జూ టీన్స్ పేరుతో బ్రాండింగ్ జీన్స్ అమ్ముతున్నారు. పులులు, సింహాలు, కొన్ని రకాల ఎలుగుబంట్లు అక్కడి ఓ జూలో ఉంటున్నాయి. అయితే జూ జీన్స్ వాళ్లు జూ వాళ్ల సహకారంతో జీన్స్ ప్యాంట్లు కుట్టేందుకు వాడే ముడిసరకును కారు, జీపు టైర్లకు, ఫుట్ బాల్స్ కు పూర్తిగా చుట్టేసి పార్కులోని జంతువుల మధ్య పడవేస్తారు. ఆ వెంటనే పులులు, సింహాలు ఆ జీన్స్ ముడిసరుకును చీల్చి చెండాడుతాయి. దీంతో బట్ట చాలా చోట్లు చీరుకుపోయినట్లుగా తయారవుతుంది. జూ జీన్స్ సంస్థ వాళ్లు ఆ ముడిసరుకును మళ్లీ సేకరించి ప్యాంట్లు, కొన్ని మోడల్ జీన్స్ షర్టులను రూపొందిస్తారు. ఆ తర్వాత జూ జీన్స్ బ్రాండ్ పేరుతో మార్కెట్లోకి తీసుకొస్తారు. ఈ విధానం మొదలుపెట్టిన తర్వాత అమ్మకాలు విపరీతంగా పెరిగిపోయాయని నిర్వాహకులు చెబుతున్నారు. ఈ జంతువులను గౌరవించేందుకు పులుల సాయంతో చేసిన డ్రెస్సులకు టీ1, లయన్స్ తో అయితే ఎల్1, ఎలుగుబంట్లు రబ్ చేసిన వాటి జంతువుల సహాయంతో డిఫరెంట్ ప్రాసెస్ వాడుతున్నారని తెలిసే కస్టమర్లు వీటిని కొనుగోలు చేయడం విశేషం. ఈ నెల 6 నుంచి 21 వరకూ హిటాచీ నగరంలో ఉత్పత్తులను అమ్మి, వచ్చే లాభాలను కమైన్ జూతో పాటు మరో సంస్థకు విరాళం ఇవ్వనున్నట్లు జీన్స్ సంస్థ ఉద్యోగి తెలిపారు. -
వీధుల్లో సింహాలు, పులులు, ఎలుగుబంట్లు
బిలిసి: జార్జియా క్యాపిటల్ నగరం ప్రజలు వణికి పోతున్నారు. అక్కడి జూపార్క్లలోని సింహాలు, పులులు, ఎలుగుబంట్లు, ఖడ్గమృగాలు, మొసళ్లు తప్పించుకొని వీధుల్లో విహరిస్తుండటంతో బిక్కుబిక్కుమంటున్నారు. గత కొద్ది రోజులుగా అక్కడ విపరీతమైన వరదలు వస్తున్నాయి. ఈ వరదల ప్రభావం జూ పార్క్ లపై కూడా పడి ఆ జంతువులన్నీ తప్పించుకున్నాయి. సింహాలు, పులులు, మొసళ్లు, ఖడ్గ మృగాలు, ఇతర జంతువులు ఇప్పుడు వీధుల్లో దర్శనమిస్తున్నాయి. దీంతో వీటిని తిరిగి బందించేందుకు అధికారులు నానా తంటాలు పడుతున్నారు. ఇప్పటికే వరదల కారణంగా ఆ పట్టణంలో పదిమందికి పైగా ప్రాణాలుకోల్పోవడంతోపాటు పరిస్థితులు అస్తవ్యస్తంగా మారడంతో అధికారులు తీరిక లేకుండా ఉన్నారు. తాజాగా జూ పార్క్ లలో జంతువులు కూడా పారిపోవడంతో అటూ సహాయ చర్యలు చూడలేక, మరోపక్క జంతువులను బందించలేక వారి తల ప్రాణంతోకకొచ్చిన పరిస్థితి ఎదురవుతోందట. ప్రజలందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ వరదల కారణంగా చాలా జంతువులు ప్రాణాలు కోల్పోయాయి.