
బాలీవుడ్ నటుడు ఓ స్టోర్ లాంచింగ్‌లో సందడి చేశారు. కొత్తగూడలోని శరత్‌సిటీ మాల్‌లో ఇండియన్ టెర్రైన్ ఎండీ నర్సింహన్‌తో కలిసి బుధవారం ఆయన సరికొత్త కాన్సెప్ట్ స్టోర్‌ను ప్రారంభించారు. ఫ్యాషన్ ప్రేమికులకు నాణ్యమైన వివిధ డిజైన్ల దుస్తులు అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. సహజమైన స్టైల్‌గా ఉండే దుస్తులు ఇష్టమని ఓ తెలుగు సినిమాలో నటిస్తున్న కునాల్ కపూర్ పేర్కొన్నారు.
చేనేత..ఓ ప్రామాణికత..
ఫ్యాషన్ అంటే అనుసంధానం చేసేది, అనుభూతిని కలిగించేది.. మనం ధరించే వ్రస్తాలు అందమైన అనుభూతులనే కాకుండా సామాజికంగా మంచిని ప్రోత్సహించాలని నటి తేజస్వి మడివాడ తెలిపారు. కళాధర్ హ్యాండ్లూమ్స్ ఆధ్వర్యంలో రానున్న హైఫ్రీక్వెన్సీ దుస్తుల శ్రేణి కోసం నటి తేజస్వి సంస్థతో కలిసి పనిచేయనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సహజంగా లభించే ఫైబర్స్, స్వచ్ఛమైన పత్తి, నార, పట్టు నుంచి తయారైన దుస్తులను అమితంగా ఇష్టపడతాను, ఇలాంటి చేనేత ఫ్యాషన్ ఔత్సాహిక ఉన్న బ్రాండ్‌తో భాగస్వామిగా మారడం సంతృప్తిగా ఉందని అన్నారు.
ప్రామాణికతపై నమ్మకం, చేతన ఫ్యాషన్ పట్ల నటి తేజస్వీకి ఉన్న ఉత్సుకత ఈ తరం ఫ్యాషన్ ప్రియులకు ఆదర్శమని కళాధర్ హ్యాండ్లూమ్స్ డైరెక్టర్ కళాధర్ రచబతుని పేర్కొన్నారు. ఈ భాగస్వామ్యంలో భాగంగా మొదటి డ్రాప్‌లో క్లీన్ సిల్హౌట్‌లు, బ్రీతబుల్ టెక్చర్‌తో సమకాలీన హంగులతో భారతీయ హస్తకళను ప్రదర్శించే సీజన్‌లెస్ కలెక్షన్స్ ఉంటాయని పేర్కొన్నారు.