ఆమె మహిళ.. అందుకే హత్య చేశా! | young lady have been killed just for being a woman | Sakshi
Sakshi News home page

ఆమె మహిళ.. అందుకే హత్య చేశా!

May 25 2016 12:56 PM | Updated on Sep 4 2017 12:55 AM

ఆమె మహిళ.. అందుకే హత్య చేశా!

ఆమె మహిళ.. అందుకే హత్య చేశా!

హత్య కేసును విచారిస్తున్న పోలీసులకు కిమ్(34) అనే హంతకుడు షాకింగ్ విషయం చెప్పాడు.

సియోల్: దక్షిణ కొరియా రాజధాని సియోల్లో జరిగిన హత్య కేసును విచారిస్తున్న పోలీసులకు కిమ్(34) అనే  హంతకుడు షాకింగ్ విషయం చెప్పాడు. 23 ఏళ్ల ఓ యువతిని హత్య చేసిన కిమ్.. ఆమె మహిళ అయినందుకే హత్య చేశానని విచారణలో తాపీగా చెప్పడంతో పోలీసులు నివ్వెరపోయారు.

వివరాల్లోకి వెళ్తే.. సియోల్లోని సియోచో ప్రాంతంలోని ఓ అపార్ట్మెంట్లోని బాత్ రూంలో ఇటీవల ఓ మహిళ(23) దారుణంగా హత్యకు గురైంది. ఆమె బాయ్ఫ్రెండ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు సీసీ ఫుటేజీ సహాయంతో హత్యకు పాల్పడింది ఆ అపార్ట్మెంట్లో పనిచేసే కిమ్గా గుర్తించారు. కిమ్ను అదుపులోకి తీసుకొని విచారించగా.. అతడు మహిళా ద్వేషి అని, ఎటువంటి కారణం లేకుండానే.. ఆమె మహిళ అయినందునే హత్య చేశాడని తేలింది. పధకం ప్రకారం యువతి ఫ్లాట్లోకి కత్తితో ప్రవేశించిన కిమ్.. ఆమెను విచక్షణారహితంగా పొడిచిచంపినట్లు పోలీసులు వెల్లడించారు. ఇటీవల అక్కడ ఇదే తరహాలో లిఫ్టులో వెళ్తున్న ఓ మహిళను అకారణంగా ఓ యువకుడు చితకబాదాడు.
 

Advertisement
 
Advertisement
Advertisement