అదృష్టం అంటే ఆమెదే!. | Woman Wins Three Lotteries Just Weeks Apart | Sakshi
Sakshi News home page

లాటరీలో రూ.32 కోట్లా...

Nov 15 2017 3:20 PM | Updated on Aug 24 2018 8:18 PM

Woman Wins Three Lotteries Just Weeks Apart - Sakshi

జీవితంలో ఒక్కసారైనా లాటరీ తగులుతుందేమోనని ఎదురుచూడని వారు ఉండరు. ఒక్కసారి లాటరీ తగిలితే చాలు జీవితాలు మారిపోతాయని అనుకుంటారు. ఆ అదృష్టం అందరికీ ఉండదు. నూటికో కోటికో ఒకరి వస్తుంది. కానీ అమెరికాకు చెందిన ఓ మహిళకు మాత్రం అదృష్టం ఓరేంజ్‌లో ఉంది. ఒకసారి లాటరీ తగులుతుందో లేదో అని ఆశగా చూసే వారు అసూయ పడేలా వారం రోజుల్లో ఏకంగా మూడుసార్లు లాటరీలో కోట్ల రూపాయలు గెలుచుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. వర్జీనియాకు చెందిన బ్రెండా జెంట్రీ అనే మహిళ వారం రోజుల్లో ఏకంగా మూడుసార్లు లాటరీలు గెలుచుకుంది. వర్జీనియా లాటరీ సంస్థ వెబ్‌సైట్‌ నిర్వహించిన లాటరీలో ఏకంగా మూడు సార్లు రూ. 3,26,000, రూ.32,600, రూ.32,59,62,500  చొప్పున పెద్ద మొత్తంలో నగదు గెలుచుకుంది. గెలుచుకున్న మొత్తాన్ని 30 ఏళ్లపాటు వాయిదా పద్దతిలో చెల్లించాలా లేదా ఏకకాలంలో తీసుకుంటారా అని నిర్వాహకులు అడుగ్గా.. ఆమె మొత్తం ఒకేసారి కావాలని కోరింది.

ఒక్కసారి అంత మొత్తం రావడంతో జెంట్రీ ఒకింత సంభ్రమాశ్చర్యాలకు గురైంది. తన ఆనందాన్ని మాటల్లో వ్యక్తపరచలేనని తెలిపింది. అంత మొత్తంలో డబ్బు వచ్చినా తన జీవన శైలిలో మార్పు ఉండదని, గతంలో ఎలా ఉన్నానో భవిష్యత్తులో అలాగే ఉంటానని పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement