కశ్మీర్‌పై మధ్యవర్తిత్వం చేస్తా: ట్రంప్‌

Willing to mediate on Kashmir if both India, Pak agree - Sakshi

న్యూయార్క్‌: కశ్మీర్‌ చాన్నాళ్లుగా సాగుతున్న అత్యంత సంక్లిష్టమైన సమస్య అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ పేర్కొన్నారు. ఈ సమస్య పరిష్కారం కోసం మధ్యవర్తిత్వం చేయడానికి తాను సిద్ధమేనని పునరుద్ఘాటించారు. అయితే, అందుకు భారత్, పాక్‌లు రెండూ ఒప్పుకోవాలన్నారు. తాను చాలా గొప్ప మధ్యవర్తినని ట్రంప్‌ ఈ సందర్భంగా చెప్పుకున్నారు. పాకిస్తాన్‌ ప్రధాన మంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌తో భేటీ సందర్భంగా సోమవారం ట్రంప్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘భారత్, పాక్‌లు ఒప్పుకుంటే మధ్యవర్తిత్వానికి నేను సిద్ధమే’ అన్నారు.

భారత ప్రధాని పాల్గొన్న హౌడీ మోదీ కార్యక్రమంపై ఇమ్రాన్‌ ఖాన్‌ సమక్షంలోనే ట్రంప్‌ ప్రశంసలు కురిపించడం విశేషం. ‘ఉగ్రవాదంపై ఇక యుద్ధమేనని, కశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్‌ 370ని రద్దు చేయడం సొంత దేశాలనే సరిగ్గా నడుపుకోలేని కొందరికి నచ్చడం లేదు. ఉగ్రవాద మూలాలు ఎక్కడున్నాయో అందరికీ తెలుసు’ అని పాక్‌ను పరోక్షంగా ప్రస్తావిస్తూ మోదీ పేర్కొన్న విషయం తెలిసిందే. కశ్మీర్‌ ద్వైపాక్షిక సమస్య అని, మూడో దేశం జోక్యం ఇందులో అవసరం లేదని ఇప్పటికే పలు సందర్భాల్లో భారత్‌ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. గత నెలలో జీ7 సదస్సు సందర్భంలోనూ ట్రంప్‌ తో మోదీ ఇదే విషయాన్ని చెప్పారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top