హెచ్1బి వీసాలకు ఇక గడ్డుకాలమే! | will not allow H1B visa holders to replace US workers, says Donald Trump | Sakshi
Sakshi News home page

హెచ్1బి వీసాలకు ఇక గడ్డుకాలమే!

Dec 10 2016 10:43 AM | Updated on Sep 26 2018 6:40 PM

హెచ్1బి వీసాలకు ఇక గడ్డుకాలమే! - Sakshi

హెచ్1బి వీసాలకు ఇక గడ్డుకాలమే!

అమెరికాలో ఉద్యోగాలు అమెరికన్లకే అన్న నినాదంతో అధ్యక్షుడిగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్.. తన విధానాలను స్పష్టం చేస్తున్నారు.

అమెరికాలో ఉద్యోగాలు అమెరికన్లకే అన్న నినాదంతో అధ్యక్షుడిగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్.. తన విధానాలను స్పష్టం చేస్తున్నారు. అమెరికన్ ఉద్యోగుల స్థానంలో హెచ్1బి వీసాలతో వచ్చిన విదేశీయులు పనిచేయడానికి తాను ఏమాత్రం అనుమతించేది లేదని చెప్పారు. డిస్నీ వరల్డ్ సహా పలు అమెరికన్ కంపెనీలలో చాలామంది భారతీయులు హెచ్1బి వీసాలతో వచ్చి పనిచేస్తున్నారు. అలాంటి కంపెనీలపై ట్రంప్ వ్యాఖ్యల ప్రభావం గట్టిగా పడే అవకాశం ఉంది. ప్రతి ఒక్క అమెరికన్ జీవితాన్ని కాపాడేందుకు తాను పోరాడతానని వేలాది మంది మద్దతుదారుల మధ్య జరిగిన సభలో ట్రంప్ చెప్పారు. కేవలం వీసాల విషయాన్ని ప్రస్తావించడమే కాక, డిస్నీలాండ్ లాంటి కొన్ని కంపెనీల పేర్లను కూడా ఆయన ప్రకటించారు. 
 
ఎన్నికల ప్రచారం సమయంలో కూడా తాను కొంతమంది అమెరికన్లను కలిసినప్పుడు... తమ ఉద్యోగాలు పీకేశారని, తమ స్థానంలో విదేశీయులను నియమించుకుంటున్నారని వాళ్లు చెప్పారని ట్రంప్ అన్నారు. ఇలాంటివి ఇక ఏమాత్రం జరగనిచ్చేది లేదని హెచ్చరించారు. దాంతో అక్కడున్నవాళ్లంతా ఒక్కసారిగా చప్పట్లు మార్మోగించారు. ఉద్యోగాలు పీకేయడమే కాక..  కొత్తగా వచ్చేవాళ్లకు ట్రైనింగ్ ఇస్తే తప్ప చివర్లో ఇవ్వాల్సిన ప్రయోజనాలను కూడా ఇవ్వలేదని, ఇది మరింత దారుణమని ట్రంప్ వ్యాఖ్యానించారు. డిస్నీ వరల్డ్, మరో్ రెండు ఔట్‌సోర్సింగ్ కంపెనీలపై వాటిలో ఇంతకుముందు పనిచేసిన టెక్నాలజీ సిబ్బంది కేసులు దాఖలు చేశారు. తమ ఉద్యోగాలు పీకేసి, తక్కువ జీతాలకు హెచ్1బి వీసాలపై వచ్చే విదేశీయులను నియమించుకున్నారని, వాళ్లలో ఎక్కువ మంది భారతీయులేనిన ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. డిస్నీవరల్డ్‌లో మొత్తం 250 మందిని 2015 జనవరిలో ఇలా పీకేశారు. హెచ్‌సీఎల్, కాగ్నిజెంట్ టెక్నాలజీస్ కూడా ఇలా చేసిన కంపెనీల్లో ఉన్నాయని తెలుస్తోంది. ఇప్పుడు ఇలాంటి కంపెనీలన్నీ ట్రంప్ తేబోయే కొత్త చట్టాలతో ఇబ్బంది పడక తప్పదు.

Advertisement
 
Advertisement
Advertisement