వాట్సాప్ : న్యూ ఇయర్ రోజున రికార్డు బ్రేకింగ్ మెసేజెస్ షేర్డ్ | Record Breaking 10,000 Crores of Whatsapp messages Exchanged - Sakshi
Sakshi News home page

ఆ ఒక్క రోజే వాట్సాప్‌లో 10,000 కోట్ల మెసేజ్‌లు!

Jan 3 2020 2:59 PM | Updated on Jan 3 2020 4:29 PM

WhatsApp Users Exchanged Hundred Billion Messages - Sakshi

న్యూయార్క్‌ : ఇన్‌స్టంట్‌ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ మరో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. వాట్సాప్‌ ఫ్లాట్‌ఫాంగా నూతన సంవత్సర శుభాకాంక్షలతో మెసేజ్‌లు పోటెత్తాయి. న్యూ ఇయర్‌ విషెస్‌ చెప్పేందుకు వాట్సాప్‌ను ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఎంచుకోవడంతో ఆ ఒక్కరోజే ఏకంగా 10,000 కోట్ల మెసేజ్‌లు వెల్లువెత్తాయి. ఒక్కరోజులో ఇంత భారీ సంఖ్యలో మెసేజ్‌లు ఎక్స్ఛేంజ్‌ కావడం ఇదే అత్యధిక రికార్డుగా నమోదైంది. వీటిలో 2000 కోట్లకు పైగా మెసేజ్‌లు భారతీయులు పంపినవే కావడం విశేషం.

పదివేల కోట్లకు పైగా వాట్సాప్‌లో షేరయిన మెసేజ్‌ల్లో 1200 కోట్లు ఇమేజ్‌లున్నాయి. నూతన సంవత్సరంలోకి ప్రవేశించే డిసెంబర్‌ 31 అర్ధరాత్రి వరకూ 24 గంటల సమయంలో ప్రపంచవ్యాప్తంగా 10,000 కోట్ల (100 బిలియన్‌) మెసేజ్‌లు షేర్‌ అయ్యాయని వాట్సాప్‌ ఓ ప్రకటనలో పేర్కొంది. పదేళ్ల కిందట వాట్సాప్‌ సేవలు మొదలైనప్పటి నుంచి ఒకే రోజు ఇంత పెద్ద సంఖ్యలో మెసేజ్‌లు షేరవడం ఇదే తొలిసారని తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement