70 కోట్లకు చేరుకున్న వాట్స్ప్ వినియోగదారులు | WhatsApp Keeps on Growing, Hits 700 Million Users | Sakshi
Sakshi News home page

70 కోట్లకు చేరుకున్న వాట్స్ప్ వినియోగదారులు

Jan 8 2015 11:51 AM | Updated on Sep 2 2017 7:24 PM

70 కోట్లకు చేరుకున్న వాట్స్ప్ వినియోగదారులు

70 కోట్లకు చేరుకున్న వాట్స్ప్ వినియోగదారులు

వాట్సప్ మెసేజ్ సర్వీసు వినియోగదారుల సంఖ్య 70 కోట్లకి చేరిందని ఆ సంస్థ సీఈవో జాన్ కూమ్ గురువారం వాషింగ్టన్లో వెల్లడించారు.

వాషింగ్టన్: వాట్సప్ మెసేజ్ సర్వీసు వినియోగదారుల సంఖ్య 70 కోట్లకి చేరిందని ఆ సంస్థ సీఈవో జాన్ కూమ్ గురువారం వాషింగ్టన్లో వెల్లడించారు. గత ఏడాది ఆగస్టులో ఈ సంఖ్య 60 కోట్లుగా ఉందని తెలిపారు.  ప్రతిరోజు తమ నెట్వర్క్ ద్వారా వినియోగదారులు నిత్యం 3 వేల కోట్ల సందేశాలు పంపుతున్నారని... దీంతో వాట్సప్ అతి పెద్ద సామాజిక నెట్వర్క్గా అవతరించిందని పేర్కొన్నారు.

ఇన్స్టాగ్రమ్, ట్విట్టర్లు 30 కోట్లు, 28.4 కోట్ల వినియోగదారులతో ఆ తర్వాతి స్థానాలను ఆక్రమించాయని చెప్పారు. వాట్సప్ నెట్వర్క్ రూ.1.18 లక్షల కోట్ల వ్యాపారంతో ముందుకు సాగుతోందని వివరించారు. 130కోట్ల మంది వినియోగిస్తున్న ఫేస్బుక్ ఇప్పటికీ అగ్రస్థానంలోనే ఉందని తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement