వైరల్‌ వీడియో: ఆ పక్షి పేరేంటో చెప్పండి! | Viral Video Leaves Netizens Stunned Bird Holding A Shark | Sakshi
Sakshi News home page

వైరల్‌ వీడియో: ఆ పక్షి పేరేంటో చెప్పండి!

Jul 3 2020 3:26 PM | Updated on Jul 3 2020 9:38 PM

Viral Video Leaves Netizens Stunned Bird Holding A Shark - Sakshi

సరదాగా గడుపుదామని బీచ్‌కు వెళ్లిన పర్యాటకులకు అక్కడ కనిపించిన దృశ్యం ఆశ్చర్యాన్ని కలిగించింది. సముద్ర తీరాన హాయిగా గడుపుతున్న వేళ ఒడ్డుకు దగ్గరగా ఉన్న షార్క్‌ను ఓ ‘పక్షి’ కాళ్లతో పట్టుకుని మేఘాల్లోకి తీసుకువెళ్లింది. దక్షిణ కరోలినాలోని మైట్లే బీచ్‌లో చోటుచేసుకున్న ఘటనకు సంబంధించిన వీడియోను కెల్లీ బర్గేజ్‌ అనే నెటిజన్‌ ఫేస్‌బుక్‌లో షేర్‌ చేశాడు. వీడియోలో కనిపించిన పక్షి ఏమిటో చెప్పాలంటూ పజిల్‌ విసిరాడు. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియోను ఇప్పటికే 14 మిలియన్‌ మంది వీక్షించగా.. వేలల్లో కామెంట్లు వస్తున్నాయి. ‘‘ప్రకృతి చాలా అద్భుతమైనది. అందరినీ నీళ్లల్లోకి లాక్కెళ్లే షార్క్‌ ఇలా పక్షి కాళ్లకు చిక్కింది. నిజానికి అది షార్కే అంటారా. నాకైతే అది లేడీ ఫిష్‌ లేదా స్పానిష్‌ మాకెరెల్‌ అనిపిస్తోంది’’అంటూ తమకు తోచిన సమాధానం ఇస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement