వైరల్‌ : ఒక తల.. రెండు ముఖాలు | Viral cat born With Two Faces In Oregon | Sakshi
Sakshi News home page

ఆరెగాన్‌లో‌ వింత పిల్లి పిల్ల జననం

May 24 2020 5:27 PM | Updated on May 24 2020 5:36 PM

Viral cat born With Two Faces In Oregon - Sakshi

రెండు ముఖాలతో జన్మించిన పిల్లి

సాక్షి, న్యూయార్క్‌ : అమెరికాలోని ఆరెగాన్‌లో ఓ వింత పిల్లి జన్మించింది. ఒక తల రెండు ముఖాలు ఉండటం దాని ప్రత్యేకత. ఒక్కో ముఖానికి యథావిథిగా రెండేసి కళ్లు, ఓ ముక్కు, నోరు ఉన్నాయి. దీని యజమానులు ఓ ముఖానికి బిస్కట్స్‌ అని, మరో ముఖానికి గ్రేవీ అని పేర్లు పెట్టారు. ఈ వింత పిల్లి పిల్లకు సంబంధించిన వీడియోను దాని వ్యక్తిగత ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో షేర్‌ చేశారు. దీంతో వీడియో కాస్తా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, రెండు ముఖాల పిల్లులు జన్మించటం చాలా అరుదు. ( ఆవు అంత్య‌క్రియ‌లు: గుంపులుగా జ‌నం )

ఇలాంటి వింత పిల్లులను జానుస్‌ అని పిలుస్తారు. ఈ పేరు కూడా రోమన్‌ దేవుడు జానుస్‌ పేరు మీద వచ్చిందే. జానుస్‌ అనే‌ దేవుడు ఓ తలతో భూతాకాలాన్ని, మరో తలతో భవిష్యత్తును చూడగలడని ప్రతీతి. అయితే ఇలాంటి పిల్లులు ఆరోగ్యంగా బ్రతకం కష్టమైన పని. బిస్కట్స్‌, గ్రేవీల పరిస్థితి కూడా ప్రస్తుతం బాగోలేదు. వాటి ఆరోగ్యంపై స్పందిస్తున్న నెటిజన్లు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement